Shraddha Murder Case: శ్రద్ధను చంపిన 15 రోజుల్లోనే మరో యువతితో డేటింగ్.. రూమ్ కి తీసుకొచ్చిన అఫ్తాబ్.. ఎంక్వైరీలో షాకింగ్ విషయాలు

యాప్ ద్వారా శ్రద్ధా వాల్కర్(26)కు అఫ్తాబ్ అమీన్ పూవానాలాకు పరిచయం ఏర్పడింది. శ్రద్ధాను చంపిన 15-20 రోజుల్లోనే మరో యువతితో డేటింగ్ మొదలుపెట్టాడని అధికారులు వివరించారు. కొత్త ప్రేయసిని రెగ్యులర్‌గా అపార్ట్‌మెంట్‌కు తీసుకొస్తుండేవాడని,..

Shraddha Murder Case: శ్రద్ధను చంపిన 15 రోజుల్లోనే మరో యువతితో డేటింగ్.. రూమ్ కి తీసుకొచ్చిన అఫ్తాబ్.. ఎంక్వైరీలో షాకింగ్ విషయాలు
Shraddha Murder Case
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2022 | 7:35 AM

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘శ్రద్ధా హత్య కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పోలీసుల విచారణలో తాజాగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్దా శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టి అఫ్తాబ్ అమీన్ పూవానాలా అక్కడే రోజూ నిద్రించేవాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు డేటింగ్ యాప్ లో “బంబుల్” ద్వారా మరో యువతితో పరిచయం పెంచుకుని..  ఆ యువతితో డేటింగ్ మొదలుపెట్టాడని.. ఆ యువతిని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చుకునేవాడని పోలీసులు వెల్లడించారు. అయితే ఇదే యాప్ ద్వారా శ్రద్ధా వాల్కర్(26)కు అఫ్తాబ్ అమీన్ పూవానాలాకు పరిచయం ఏర్పడింది. శ్రద్ధాను చంపిన 15-20 రోజుల్లోనే మరో యువతితో డేటింగ్ మొదలుపెట్టాడని అధికారులు వివరించారు. కొత్త ప్రేయసిని రెగ్యులర్‌గా అపార్ట్‌మెంట్‌కు తీసుకొస్తుండేవాడని, ఆ సమయంలో ఫ్రిడ్జ్‌లోని శరీర భాగాలను కప్‌బోర్డ్‌లోకి మార్చేవాడని పోలీసులు తెలిపారు. శ్రద్ధా తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి చూస్తుండేవాడని దర్యాప్తులో తేలిందన్నారు.

మరోవైపు శ్రద్ధా హత్యపై ఎవరికీ అనుమానం రాకుండా.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ యాక్టివ్‌గా ఉండేలా అఫ్తాబ్ వ్యవహరించాడని..శ్రద్దా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను జూన్ వరకు ఆమె సజీవంగా ఉన్నట్లు అందరూ భావించేలా చేయడానికి ఉపయోగించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. శ్రద్ధా ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండేవాడని పోలీసులు గుర్తించారు. అయితే రెండు నెలలుగా శ్రద్దా ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండడంతో ఫ్రెండ్స్ కు అనుమానం వచ్చిందని వివరించారు. హత్య చేయాలనే ప్రణాళికలో భాగంగానే అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకున్నాడని అనుమానిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా తన ప్రియురాలి మే 18న హత్య చేశాడు.సుమారు ఆరునెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.  నవంబరు 14న ఢిల్లీ పోలీసులు పూనావాలాను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అఫ్తాబ్ శ్రద్ధా ఫోన్‌ని పారేసాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు ఉపయోగించిన ఆయుధం కోసం పోలీసులు వెతుకుతున్నారు. చెఫ్‌గా శిక్షణ పొందిన అఫ్తాబ్.. రక్తపు మరకలను ఎలా క్లీన్ చెయ్యాల్లో గూగుల్‌లో తెలుసుకున్నాడు. శరీరాన్ని ముక్కలుగా కట్ చేయడానికి ముందు శరీర నిర్మాణం ఏవిధంగా ఉంటుందో కూడా తెలుసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

అఫ్తాబ్‌కు ఉరిశిక్షను డిమాండ్ చేస్తున్న శ్రద్దా తండ్రి

శ్రద్ధా వాకర్ తండ్రి నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ ఘటన వెనుక ‘లవ్ జిహాద్’ కోణం కూడా ఉందని ఆయన అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు.. తమ దర్యాప్తును సరైన దిశలో చేస్తారని.. తన కూతురుకి న్యాయం జరుగుతుందని తాను విశ్వసిస్తున్నాను” అని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?