Satyendar Jain Video: బీజేపీ కావాలనే దుష్ప్రచారం చేస్తుందన్న ఢిల్లీ నేత.. అమిత్ షా కోసం జైలులో ప్రత్యేక గదినే నిర్మించారని ఎద్దేవా..
మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు మసాజ్ విషయంలో బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్దం మరింత ముదిరింది. ఆప్ నేతల అధికార

మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు మసాజ్ విషయంలో బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్దం మరింత ముదిరింది. ఆప్ నేతల అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అంటూ బీజేపీ విమర్శించింది. అయితే బీజేపీ కామెంట్స్‌కు కౌంటర్ ఇంచ్చింది ఆప్. రెండు సర్జరీలు జరిగిన పేషంట్‌కు డాక్టర్ల సలహా మీద ఫిజియోథెరపీ చేస్తే దానిని వీడియో తీసి బీజేపీ నేతలు ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించడం సిగ్గుచేటని ఆప్ ఎదురు దాడికి దిగింది. కానీ ఇప్పుడు తీహార్ జైలు అధికారులు మసాజ్ చేసింది ఓ ఖైదీ అని తేల్చడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రింకూ అనే ఖైదీ చేత మసాజ్ చేయించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సీఎం కేజ్రీవాల్ అండతోనే సత్యేంద్రజైన్‌కు తీహార్ జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. తీహార్ జైలు నుంచి సత్యేంద్రజైన్ వసూళ్ల రాకెట్ నడిపిస్తున్నారని ఆరోపించారు. తీహార్ జైల్లో ఉన్న మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌తో సత్యేంద్రజైన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.
అయితే సత్యేంద్ర జైన్ జైలు సేవలపై ఆప్ మంత్రి గోపాల్ రాయ్ స్పందించారు. ని అయన అన్నారు. ‘‘ దాదాపు 10 రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ దుష్ప్రచారం చేస్తుంది. ‘దుష్ప్రచారం చేశాం, ఇకపై చేస్తాం’ అన్నదే బీజేపీ నినాదం. కానీ ‘పని చేశాం, ఇంకా పని చేస్తాం’ అన్నదే కేజ్రీవాల్ నినాదం. తిట్లు (ఆరోపణలు) తిట్టేవారికి ఓటేయాలా లేదా తమ కోసం పనిచేసేవారికి ఓటేయాలా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి. గుజరాత్ జైల్లో అమిత్ షా ఉన్నప్పుడు ఏకంగా ఒక ప్రత్యేక గదినే నిర్మించారు. అంతటి స్పెషల్ ట్రీట్మెంట్ దేశంలో ఎక్కడా జరగలేదు. ఇప్పుడు డిసెంబర్ 4న ఢిల్లీ ప్రజలు బీజేపీకి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు’’ అని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ బీజేపీ నేతలపై మండిపడ్డారు.
మరోవైపు జైలు అధికారులు తనకు డ్రైప్రూట్స్, సలాడ్స్ ఇవ్వడం లేదని మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. తమ మతపరమైన ఉపవాసం సమయంలో తనకు ఆహారం అందించకపోవడం చట్టవిరుద్ధమంటున్నారు. ఇది తనను వేధించడమేనంటూ కోర్టులో పిటిషన్ వేశారు. తనకు మతాచారాల ప్రకారం ఫుడ్ అందించాలని తీహార్ అధికారులను ఆదేశించాలని కోరారు. కాగా, మే 30న మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి సత్యేంద్ర జైన్ ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇంతలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం




