Shiv Sena: రెండున్నరేళ్లుగా మీ ఇంట్లోకి ప్రవేశమే లేదు.. ఉద్దవ్‌ ఠాక్రేపై రెబల్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..

|

Jun 23, 2022 | 3:34 PM

Shiv Sena: శివసేన పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన ఉద్వేగభరిత విజ్ఞప్తి తరువాత..

Shiv Sena: రెండున్నరేళ్లుగా మీ ఇంట్లోకి ప్రవేశమే లేదు.. ఉద్దవ్‌ ఠాక్రేపై రెబల్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..
Sanjay Shirsat
Follow us on

Shiv Sena: శివసేన పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన ఉద్వేగభరిత విజ్ఞప్తి తరువాత.. రెబల్ ఎమ్మెల్యేల నుంచి షాకింగ్ రెస్పాండ్స్ వచ్చింది. తిరుగుబాటు నాయకుడైన ఏక్నాథ్ షిండే శిబిరంలోని ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ సీఎం ఉద్ధవ్‌కు లేఖ రాశారు. రెండున్నరేళ్లుగా ఇంటి తలుపులు మూసివేసి.. సొంత పార్టీ నేతలను విస్మరించారని ఆరోపించారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం పని చేసిన నేతలను ఈ రెండున్నరేళ్లలో కనీసం పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మాకు రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి ఇంట్లోకి ప్రవేశమే లేకుండాపోయింది. మమ్మల్ని ఆయన గేటు బయటే గంటల తరబడి వేచి ఉండేలా చేశారు.’’ అని గౌహతి ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదే సమయంలో ‘‘షిండే తలపులు మాకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి.’’ అని పేర్కొన్నాడు.

ఇదే సమయంలో శివసేనలో కీలకంగా మారిన ఎంపీ సంజయ్ రౌత్‌ నుద్దేశించి కూడా శిర్సత్ పరోక్ష కామెంట్స్ చేశారు. చాణక్యుడు ఎప్పుడు తమను నిమిత్తమాత్రులుగా మారుస్తాడని వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే.. పార్టీలో సంజయ్ రౌత్ ప్రాధాన్యత పెరగడం కూడా ఎమ్మెల్యేల తిరుగుబాటుకు ప్రధాన కారణం అని శివసేనలో ప్రచారం జరుగుతోంది.

ఇక అయోధ్య పర్యటనను అడ్డుకోవడంపైనా శిర్సత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉద్ధవ్ ఠాక్రే ను ప్రశ్నించారు. ‘‘అయోధ్య ప్రయాణం కోసం ముంబై విమానాశ్రయానికి వెళితే.. అక్కడి అధికారులు మా సామాగ్రిని చెక్ చేశారు. అదలాఉంచితే.. బోర్డింగ్ ప్రారంభమైన చివరి నిమిషంలో ఫోన్ చేసి.. నన్ను, ఇతర ఎమ్మెల్యేలను అయోధ్యకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆదిత్య ఠాక్రే అయోధ్యకు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపారు? చాలా మంది ఎమ్మెల్యేలను అయోధ్యకు వెళ్లొద్దని ఆదేశించారు. షిండే మాకు ఫోన్ చేసి.. అయోధ్యకు వెళ్లకూడదని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. రామ్‌లల్లా దర్శనానికి మమ్మల్ని ఎందుకు అనుమతించలేదు?’’ అని శిర్షత్ తన లేఖలో పేర్కొన్నారు. ఇకపోతే.. ‘‘తనలాంటి సేన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుని, మిత్రపక్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మామూలుగానే థాకరేని కలిసేవారు’’ అని అంటూ సొంత పార్టీ నేతల పట్ల అధినేత నిర్లక్ష్య వైఖరిని తులనాడారు.

ఇవి కూడా చదవండి

‘‘క్లిష్ట పరిస్థితుల్లో మాకు ఎప్పుడూ తెరిచి ఉండే షిండే ఇల్లు.. భవిష్యత్‌లోనూ అలాగే ఉంటుందనే నమ్మకంతోనే ఇవాళ మేం షిండేతో ఉన్నాము. నిన్న మీరు మాట్లాడింది మమ్మల్ని భావోద్వేగానికి గురి చేసింది. కానీ, ప్రాథమిక ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలోనే నాలోని భావాలను మీకు తెలియజేయడానికే ఈ లేఖ రాయవలసి వచ్చింది.’’ అని శిర్షత్ తన లేఖలో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు గ్రూపులో ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వీరిపై అర్హత వేటు పడకుండా పార్టీని చేల్చడానికి ఈ సంఖ్య సరిపోతుంది. ఈ సంఖ్య ఉద్ధవ్ ఠాక్రే వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కంటే చాలా ఎక్కువ.