
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో మరో రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ సంక్షోభం నెలకొనడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి బీజేపీ మళ్లీ ఎదురుదెబ్బ తగిలించగా, మంగళవారం శివసేనకు చెందిన 17 మంది మంది ఎమ్మెల్యేలు గుజరాత్ చేరుకున్నారు. దీంతో ఉద్దవ్‌ఠాక్రే ప్రభుత్వం చిక్కుల్లో పడిపోయింది. ఈ రోజు ముఖ్యమంత్రి ఠాక్రే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివసేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌షిండేతో కలిసి సూరత్ హోటల్‌లో ఉన్నారని మీడియా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉద్దవ్‌ఠాక్రేకు చెమటలు పట్టాయి. దీంతో షిండేతో పాటు శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో శివసేనలో చీలికలు మొదలైనట్లు స్పష్టమవుతోంది.
పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సూరత్‌లోని ఏక్‌నాథ్ సిండేతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కొంత మంది ఎమ్మెల్యేలను పంపించారు. దీంతో షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏక్‌నాథ్ షిండేతో శివసేన మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల అనంతరం షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఖాయమని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి