Shirdi Sai Baba: షిర్డీ సాయి భక్తులకు గుడ్‌న్యూస్.. మంత్రి హామీ.. బంద్ ఉపసంహరణ..
సీఐఎస్ఎఫ్ భద్రతపై స్థానికుల మొండిపట్టుతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. స్థానిక ప్రతినిధులు చెప్పిన డిమాండ్లకు తలొగ్గింది. షిర్డీ ఆలయంలో CISF భద్రత పెట్టకుండా ప్రభుత్వం తరఫున హైకోర్టులో పోరాడుతామని మహారాష్ట్ర
సీఐఎస్ఎఫ్ భద్రతపై స్థానికుల మొండిపట్టుతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. స్థానిక ప్రతినిధులు చెప్పిన డిమాండ్లకు తలొగ్గింది. షిర్డీ ఆలయంలో సీఐఎస్‌ఎఫ్ భద్రత పెట్టకుండా ప్రభుత్వం తరఫున హైకోర్టులో పోరాడుతామని మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ వీకే పాటిల్ ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. దాంతోపాటు స్థానికుల మరికొన్ని డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. దాంతో మే1 వ తేదీన తలపెట్టిన బంద్‌ను ఉపసంహరిస్తున్నట్లు స్థానిక ప్రతినిధులు ప్రకటించారు.
ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్న కారణంగా షిర్డీలోని సాయి మందిరానికి భద్రత రెట్టింపు చేశారు. ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను.. సాయి సంస్థాన్ సిబ్బంది నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణం భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నారు. ఇందులో భాగంగా.. ఆలయాన్ని ప్రతిరోజు బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుంది. అయితే.. ఈ భద్రతా వ్యవస్థకు బదులు.. సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలన్న చర్చ మొదలైంది. సామాజిక కార్యకర్త సంజయ్ కాలే.. 2018లో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్.. సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. సీఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్కూడా అంగీకరించింది. గ్రామస్తులు మాత్రం సీఐఎస్ఎఫ్ భద్రతను వ్యతిరేకించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..