Sharad Pawar: ఇండియా కూటమిలో విభేదాలు.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

|

Sep 26, 2023 | 7:06 PM

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోనేందుకు విపక్ష పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కూటమిలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు పంజాబ్‌లోని ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అయితే విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా.. అలాగే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మధ్య వివాదం నెలకొంది.

Sharad Pawar: ఇండియా కూటమిలో విభేదాలు.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
Sharad Pawar
Follow us on

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోనేందుకు విపక్ష పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కూటమిలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు పంజాబ్‌లోని ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అయితే విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా.. అలాగే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మధ్య వివాదం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య నెలకొన్న వివాదం ప్రభావం.. విపక్ష కూటమిపై ఉండదని పేర్కొన్నారు. అలాగే ఈ పరిస్థితులు అనేవి విపక్ష ఇండియా కూటమి భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు.

అయితే ఇటువంటి త‌ర‌హా ఘ‌ట‌న‌లు చోటుచేసుకోరాద‌ని అన‌డంతో తాను అంగీక‌రిస్తాన‌ని చెప్పారు. అలాగే ఇలాంటి విష‌యాలు అనేవి విప‌క్ష ఇండియా కూట‌మి భ‌విష్యత్తుని నిర్దేశించ‌వ‌ని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మరోవైపు కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్రం ప్రస్తుతం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింద‌ని ఆరోపణలు చేశారు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నిక‌ల్లో కూడా అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రజ‌లు గెలిపించాల‌ని ప్రతాప్ సింగ్ బాజ్వా కోరారు. అలాగే ముఖ్యమంత్రి భ‌గ‌వంత్ మాన్ ప్రభుత్వం రెండు నెల‌లు కూడా అధికారంలో ఉండ‌ద‌ని, ఆప్ స‌ర్కార్‌లో 32 మంది ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్‌లో ఉన్నట్లు ఆయ‌న వెల్లడించారు. అయితే ప్రతాప్ సింగ్ బాజ్వా చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది.

పంజాబ్ ప్రజ‌లు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల‌దోయ‌డం గురించి ప్రతాప్ సింగ్ బాజ్వా మాట్లాడుతున్నార‌ని ముఖ్యమంత్రి భ‌గ‌వంత్ మాన్ మండిప‌డ్డారు. అసలు ముఖ్యమంత్రి కావాల‌నే ప్రతాప్ సింగ్ బాజ్వా ఆశ‌లు వ‌మ్ము కావ‌డం వల్లే ఆయ‌న ఇలా మాట్లాడుతున్నార‌ని అన్నారు. మీకు ఏవైన ఇబ్బందులు ఉన్నట్లైతే పార్టీ హైక‌మాండ్‌తో మాట్లాడుకోవాల‌ని భగవంత్ మాన్ పేర్కొన్నారు. అయితే విప‌క్ష ఇండియా కూట‌మిని బ‌లోపేతం చేయడం కోసం ప్రయ‌త్నాలు ఊపందుకున్న నేపథ్యంలో.. ఈ ఇండియా కూట‌మిలో భాగ‌స్వామ్యులైనటువంటి పార్టీలైన ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్‌లు పంజాబ్‌లో విమర్శలు చేసుకోవడంపై కూట‌మి ప‌క్షాల్లో ఆందోళ‌న నెలకొంది. ఇదిలా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోసం బీజేపీ, విపక్ష కూటమి తమ ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..