
NCP working presidents: ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ తన వారసత్వంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన కూతురు సుప్రియా సూలేను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. సుప్రియా సూలేకు మహారాష్ట్రతో పాటు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఇంఛార్జ్‌ను చేశారు. ప్రఫుల్‌పటేల్‌ను పార్టీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శరద్ పవార్ పార్టీలో కీలక మార్పులు చేస్తూ ప్రకటించారు. దీంతోపాటు 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ విస్తరణకు తొడ్పడాలని.. శరద్ పవార్ ఈ సందర్భంగా నాయకులకు పిలుపునిచ్చారు.
సుప్రియా సూలే, ఫ్రఫుల్ పటేల్ చోటు ఇవ్వడంతో.. అజిత్‌పవార్‌ను పూర్తిగా పక్కన పెట్టిసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అజిత్‌కు పార్టీలో కొత్తగా ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు శరద్‌పవార్. గత నెల ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు శరద్‌పవార్. పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరినట్టు, అజిత్ పవార్‌తో విభేదాలు వచ్చినట్టు జోరుగా ప్రచారం జరిగింది. శరద్‌పవార్ తాజా ప్రకటన ఎన్సీపీలో ఆధిపత్యపోరును స్పష్టంగా బయటపెట్టింది. అయితే, మహారాష్ట్ర ఇంఛార్జ్‌గా సుప్రియా సూలేను పవార్ అజిత్ పవార్ సమక్షం లోనే ప్రకటించారు.
బీజేపీపై దేశవ్యాప్తంగా విపక్షాలు ఐక్యంగా పోరాడాలని శరద్‌పవార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈనెల 23న పాట్నాలో జరిగే విపక్షాల భేటీకి హాజరవుతున్నట్టు శరద్ పవర్ ప్రకటించారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా సీఎం నితిష్ కుమార్ నాయకత్వంలో పాట్నా వేదికగా విపక్షాలు సమావేశమవుతున్నాయి. 2024 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా విపక్ష పార్టీలు సమావేశం అవుతుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..