Kerala: లైంగిక వేధింపుల కేసులో కేరళ సెషన్స్ కోర్టు సంచలన వ్యాఖ్యలు..దుమారం రేపుతున్న న్యాయమూర్తి కామెంట్స్..

|

Aug 18, 2022 | 12:40 PM

కిందిస్థాయి న్యాయస్థానాలు ఇటీవల ఇస్తున్న తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఈమధ్య సంచలనం కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద దుమారానికి, వివాదానికి ఇవి కారణమవుతున్నాయి. తాజాగా లైంగిక వేధింపుల కేసులో..

Kerala: లైంగిక వేధింపుల కేసులో కేరళ సెషన్స్ కోర్టు సంచలన వ్యాఖ్యలు..దుమారం రేపుతున్న న్యాయమూర్తి కామెంట్స్..
Civic Chandran
Follow us on

Kerala Court: కిందిస్థాయి న్యాయస్థానాలు ఇటీవల ఇస్తున్న తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఈమధ్య సంచలనం కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద దుమారానికి, వివాదానికి ఇవి కారణమవుతున్నాయి. తాజాగా లైంగిక వేధింపుల కేసులో వృద్ధ రచయిత సివిక్ చంద్రన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా కేరళలోని కోజికోడ్ సెషన్స్ కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రెండేళ్ల క్రితం కోజికోడ్ లోని నంది బీచ్ సమీపంలో జరిగిన కవిత్వ శిబిరానికి హాజరైన సివిక్ చంద్ర తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీనిపై కోయిలాండి పోలీసులు సివిక్ చంద్రన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సివిక్ చంద్రన్. ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోజికోడ్ సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎస్.కృష్ణకుమార్.. యువతి చేసిన ఆరోపణలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని.. యువతి చేసిన ఫిర్యాదు నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు. ఈసందర్భంగా ప్రతివాది సివిక్ చంద్రన్ బెయిల్ దరఖాస్తుతో పాటు అందజేసిన ఫోటోలను పరిశీలించిన న్యాయమూర్తి.. 74 ఏళ్ల వికలాంగుడైన సివిక్ చంద్రన్ యువతిని తన వడిలో కూర్చోబెట్టుకుని ఛాతిని నొక్కాడనే ఆరోపణలు నమ్మేవిగా లేవని వ్యాఖ్యానించారు. సదరు మహిళ డ్రెస్సింగ్ స్టైల్ పై కూడా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులను రెచ్చగొట్టే విధంగా మహిళ డ్రెస్సింగ్ స్టైల్ ఉందని సెక్షన్ 354A ప్రకారం యువతి ఫిర్యాదు నిలబడదని కోర్టు పేర్కొంది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలు న్యాయమూర్తి కామెంట్స్ ను తప్పుబడుతున్నారు. బాధితులను చట్టపరంగా నిందిచడం సరికాదంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..