YouTube Channel Ban India: తప్పుడు ప్రచారాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం మరో ముందడుగు.. యూట్యూబ్‌ ఛానల్స్‌ బ్యాన్‌..

YouTube Channel Ban India: ఇంటర్‌నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగం పెరగడంతో సమాచార మార్పిడి చాలా సులువుగా మారింది. అయితే ఇదే సమయంలో తప్పుడు...

YouTube Channel Ban India: తప్పుడు ప్రచారాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం మరో ముందడుగు.. యూట్యూబ్‌ ఛానల్స్‌ బ్యాన్‌..
Youtube
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 18, 2022 | 12:24 PM

YouTube Channel Ban India: ఇంటర్‌నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగం పెరగడంతో సమాచార మార్పిడి చాలా సులువుగా మారింది. అయితే ఇదే సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా యూట్యూబ్‌ వేదికగా రోజుకు వందల్లో కొత్త ఛానల్స్‌ పుట్టుకొస్తున్నాయి. సరైన నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. సమాచారం సరైందా కాదా అన్న క్రాస్‌ చెక్‌ లేకుండా కంటెంట్‌ యూజర్లకు చేరువవుతోంది. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను కట్టడి చేయడానికే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లను బ్యాన్‌ చేస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రిత్వశాఖ ఐటీ చట్టం 2021 కింద ఎనిమిది యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గడిచిన మంగళవారం కేంద్రం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఇందులో 8 యూట్యూబ్‌ ఛానళ్లతో పాటు ఒక ఫేస్‌ బుక్‌ అకౌంట్‌, రెండు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లను తొలగించింది. కేంద్ర బ్లాక్‌ చేసిన ఈ యూట్యూబ్‌ చానళ్లకు మొత్తం 85 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా, 114 కోట్ల వ్యూయర్‌షిప్‌ ఉండడం గమనార్హం.

ఈ యూట్యూబ్‌ ఛానల్స్‌లో ఇండియన్‌ ఆర్మీ, జమ్మూకశ్మీర్‌తో పాటు పలు ఇతర అంశాలపై తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఛానల్స్‌లో వచ్చిన వీడియోల్లో ఉన్న సమాచారం పూర్తిగా ఫేక్‌ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. కేంద్రం బ్యాన్‌ చేసిన ఈ ఎనిమిది ఛానల్స్‌లో ఒకటి పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్‌ ఛానల్‌ ఉండడం గమనార్హం. చూశారుగా మనకు తెలియకుండానే ఫేక్‌ న్యూస్‌ ఎలా వ్యాపిస్తుందో కాబట్టి.. చూస్తోన్న కంటెంట్‌ ఎంత వరకు సరైంది, అందులో నిజం ఎంత ఉందని బేరీజు వేసుకున్న తర్వాతే అలాంటి ఛానల్స్‌ను ఫాలో కావాలి లేదంటే అన్‌ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడమే ఉత్తమం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?