ఆమె వల విసిరిందంటే విలవిలలాడాల్సిందే.. పెళ్లి కాని మగాళ్లే టార్గెట్.. అసలు విషయం తెలిసే లోపే..

| Edited By: Shaik Madar Saheb

Jul 16, 2024 | 8:11 PM

పెళ్లి కాని ప్రసాద్‌లే ఆమె టార్గెట్.. అలా ఒక్కర్నో ఇద్దర్నో కాదు.. ఏకంగా 50 మందిని నట్టేట ముంచింది ఈ లేడీ.. రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో 50 పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని మనువాడింది ఈ నిత్య పెళ్లకూతురు. ఏకంగా నలభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది. ఈ ఘటన వారం క్రితం తమినాడులో వెలుగులోకి వచ్చింది. నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఈ లేడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమె వల విసిరిందంటే విలవిలలాడాల్సిందే.. పెళ్లి కాని మగాళ్లే టార్గెట్.. అసలు విషయం తెలిసే లోపే..
Crime News
Follow us on

పెళ్లి కాని ప్రసాద్‌లే ఆమె టార్గెట్.. అలా ఒక్కర్నో ఇద్దర్నో కాదు.. ఏకంగా 50 మందిని నట్టేట ముంచింది ఈ లేడీ.. రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో 50 పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని మనువాడింది ఈ నిత్య పెళ్లకూతురు. ఏకంగా నలభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది. ఈ ఘటన వారం క్రితం తమినాడులో వెలుగులోకి వచ్చింది. నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఈ లేడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారం రోజుల క్రితం తిరుపూర్ జిల్లాలోని తారాపురం గ్రామానికి చెందిన రమేష్ అరవింద్ అనే వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు.. మిగిలిన కేసులు లాగే సాధారణ కేసుగా పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ మొదలయ్యకే ఒక్కో విషయం బయటపడుతూ వచ్చింది. చివరకు ఆ కేసులో బయటపడుతున్న ఒక్కో విషయాన్ని చూసిన తర్వాత పోలీసులే షాక్ అయ్యారు. అంతేకాదు బాధితుల్లో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉండడం షాకింగ్ కలిగించే విషయం..

ఫిర్యాదుదారుడు రమేష్ అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు.. ఏంటంటే తన భార్య తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని.. గతంలో మరో వ్యక్తితో పెళ్లయిన విషయాన్ని దాచిందని ఫిర్యాదులో పేర్కొంటూ అందుకు సంబంధించి ఆధారాలను పోలీసులకు అందజేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ కలిగించే విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదు చేసిన రమేష్ అరవింద్ చెప్పినట్టు సంధ్య అనే మహిళ వేరొకరిని పెళ్లి చేసుకొని అది దాచి తనను పెళ్లి చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా సంధ్య మోసం చేసింది ఒకరిని కాదు ఏకంగా 50 మందిని ఈ విషయం తెలిసి పోలీసులే షాక్ అవ్వడం ఒక వంతు అయితే.. మోసపోయిన బాధితుల్లో పోలీసులే ఉండడం మరో విషయం.

అసలు సంధ్య ఎవరిని ఎలా టార్గెట్ చేసి మోసం చేస్తుందో ఒకసారి చూద్దాం..

35 నుంచి 40 సంవత్సరాలు వయస్సున్నవారు పెళ్లి కాని వ్యక్తులను సంధ్య టార్గెట్ చేస్తుంది. ఎవరైతే మ్యాట్రిమోనీలో వధువు కోసం ప్రయత్నిస్తుంటారో వారి వివరాలు సేకరిస్తుంది.. సంధ్య సొంతంగా ఏర్పాటు చేసుకున్న టీం సభ్యులు పెళ్లిళ్ల బ్రోకర్ గా వారిని అప్రోచ్ అవడం మొదలుపెడతారు. అలా అప్రోచ్ అయిన తర్వాత కాంటాక్ట్ నెంబర్ తో సంధ్య సదరు పురుషులతో టచ్ లో ఉంటుంది. వాళ్లకు బాగా దగ్గరయ్యాక ఇంట్లో ఈ సంబంధం పెద్దలకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఎవరికీ తెలియకుండా ఆలయంలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఇంటికి వెళ్లడం కుటుంబ సభ్యులతో బాగా కలిసి మెలసి ఉండడం సంధ్య ఆడుతున్న డ్రామాలో మరో భాగం..

అలా కొద్ది రోజులకే ఇంట్లో వారిని మెప్పించి బంగారం ఇప్పించుకొని ఆ తర్వాత అసలు డ్రామా మొదలుపెడుతుంది. చిన్న చిన్న వాటికి చిరాకు పడడం భర్తతో గొడవ పడడం ఆ తర్వాత అలిగి పుట్టింటికి వెళ్ళిపోతున్నట్టు వెళ్లిపోవడం.. ఇదంతా మూడు నెలల్లోనే ముగుస్తుంది. మళ్ళీ కొత్త డ్రామా మొదలవుతుంది.. మరో వ్యక్తిని ట్రాప్ చేయడం పెళ్లి చేసుకోవడం బంగారం తీసుకోవడం అక్కడి నుంచి వెళ్లిపోవడం ఇలా గత కొన్నేళ్లుగా ఒక్కొక్కరిని మోసం చేస్తూ 50 మంది వరకు పెళ్లి చేసుకుని వారందరిని వదిలేసి వెళ్లిపోయి చివరకు రమేష్ అరవింద్ ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయింది.

ఇందులో ట్విస్ట్ ఏంటంటే సంధ్య వేసిన వలపు వలలో పోలీస్ అధికారులు అందులోను డీఎస్పీ స్థాయి అధికారి, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి కూడా ఉండడం పోలీసులతోపాటు అందరిని షాక్ కు గురి చేసింది. యువకులను టార్గెట్ చేస్తే అంత ఈజీగా ప్లాన్ వర్క్ అవుట్ అవ్వదని భావించిన ఈ లేడీ.. లేటు వయసు అయిన పెళ్లి కాని వారిని టార్గెట్ చేసుకోవడంతో ఈజీగా తన ప్లాన్ వర్కౌట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని మోసం చేసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే రమేష్ అరవింద్ సంధ్య సోషల్ మీడియా అకౌంట్ ను చెక్ చేయడంతోపాటు ఆధార్ కార్డు వివరాలు చూసిన తర్వాత అనుమానం వచ్చింది. అక్కడ తండ్రి పేరు కాకుండా భర్త అనే కాలం వద్ద మరో వ్యక్తి పేరు ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..