కుటుంబ కలహాలతో సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు బలి

కుటుంబంలో గొడవల వల్ల ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాల వద్దకు చేరుకున్న సుమిత్ సైన్(40) తన బంధువుకు వీడియో కాల్‌ చేసి ఈ విషయం చెప్పాడు. ఆ వ్యక్తి కూతురు, సైన్ సోదరుడు అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే రైలు దూసుకెళ్లడంతో ఆ ముగ్గురు మరణించారు. సుమిత్‌ను ఆపే ప్రయత్నంలో ముగ్గురినీ హరిద్వార్ మెయిల్ ఢీకొట్టింది.

కుటుంబ కలహాలతో సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు బలి
Crime News

Updated on: Apr 21, 2025 | 9:59 PM

రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తండ్రి సెల్ఫీ సూసైడ్‌ను ఆపేక్రమంలో కూతురు, మరో వ్యక్తి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు చెందిన కుటుంబ విభేదాల నేపథ్యంలో సుమిత్‌సైన్ (40) రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబంలో గొడవల వల్ల ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాల వద్దకు చేరుకున్న సుమిత్ సైన్(40) తన బంధువుకు వీడియో కాల్‌ చేసి ఈ విషయం చెప్పాడు. ఆ వ్యక్తి కూతురు, సైన్ సోదరుడు అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే రైలు దూసుకెళ్లడంతో ఆ ముగ్గురు మరణించారు. సుమిత్‌ను ఆపే ప్రయత్నంలో ముగ్గురినీ హరిద్వార్ మెయిల్ ఢీకొట్టింది. ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

ఇవి కూడా చదవండి