Amit Shah: హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం.. కాన్వాయ్‌వైపు దూసుకెళ్లిన ప్రైవేట్ కార్..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం తలెత్తడం కలకలం రేపింది.. అగర్తలాలో అమిత్ షా పర్యటనలో ఓ వ్యక్తి భద్రత నిబంధనలను ఉల్లంఘించారు.

Amit Shah: హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం.. కాన్వాయ్‌వైపు దూసుకెళ్లిన ప్రైవేట్ కార్..
Amit Shah

Updated on: Mar 09, 2023 | 9:05 AM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం తలెత్తడం కలకలం రేపింది.. అగర్తలాలో అమిత్ షా పర్యటనలో ఓ వ్యక్తి భద్రత నిబంధనలను ఉల్లంఘించారు. ఆయన పర్యటన సమయంలో ఓ కారు కాన్వాయ్‌వైపు దూసుకెళ్లింది..నిన్న త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారానికి వెళ్తుండగా జరిగిందీ ప్రమాదం.

త్రిపుర రాజధాని అగర్తలాలో అమిత్‌ షా పర్యటనకు వెళ్తున్నారు..ఐతే హోంమంత్రి కాన్వాయ్‌ వెళ్తుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా పోలీసులు కొన్ని వాహనాలు ఆపి ఉంచారు..అటుగా అమిత్‌ షా కాన్వాయ్‌ వెళ్తుంది..ఐతే సడన్‌గా ఓ కారు కాన్వాయ్‌ వైపు దూసుకొచ్చింది..భద్రత సిబ్బంది అక్కడే ఉండగానే ఆ కారు కాన్వాయ్‌లోకి దూసుకెళ్లింది..

అయితే సిబ్బంది ఆపడానికి ప్రయత్నించినా ఆ కారు డ్రైవర్ ఆపకుండా స్పీడ్‌గా వెళ్లిపోయాడు.. దీంతో అమిత్ షా పర్యటనలో భద్రతా సిబ్బంది లోపం బయటపడింది.. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..కారు నెంబర్‌ ప్లేట్ ఆధారంగా అతడి కోసం సెర్చ్ చేస్తున్నారు పోలీసులు..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..