Jammu And Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. జమ్ము-శ్రీనగర్ హైవేపై బారాముల్లాలో టెర్రరిస్టులు రోడ్డుపై ఐఈడీని అమర్చారు. అయితే ఉగ్రవాదుల కుట్రను పసిగట్టిన భద్రతా బలగాలు రోడ్డుపై తాత్కాలికంగా రాకపోకలను ఆపేశాయి. తరువాత బాంబ్ స్క్వాడ్‌ను రప్పించారు. ఐఈడీని బాంబ్ స్క్వాడ్ చాకచాక్యంగా నిర్వీర్యం చేసింది. దీంతో పెనుప్రమాదం తప్పింది. గత కొద్దిరోజులుగా ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. కశ్మీర్ పండిట్లను , మైనారిటీ హిందూ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. బారాముల్లా లోనే ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల దగ్గర భారీగా ఆయుధాలను , పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లష్కర్‌లో ఈ ఉగ్రవాదులు కొద్దిరోజుల క్రితమే చేరినట్టు తెలిపారు.
కాగా జమ్ముకశ్మీర్‌లో హిందువులను టార్గెట్ చేయడానికి ఈ ఇద్దరిని రిక్రూట్ చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఉగ్రవాదుల దగ్గరి నుంచి విదేశీ పిస్టల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల విరామం తరువాత ఈనెల 30వ తేదీన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతోంది. 43 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఆగస్ట్ 11న అమర్‌నాథ్ యాత్ర ముగుస్తుంది. అయితే యాత్రకు అడుగడుగునా ఆటంకాలు కలిగించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న సమాచారంతో కేంద్ర హోంశాఖ అనేక చర్యలు చేపట్టింది. ఉగ్రవాదుల స్టిక్కీ బాంబుల కుట్ర కూడా కొద్దిరోజుల క్రితమే బహిర్గతమయ్యింది. అందుకే ఈసారి అమర్‌నాథ్ యాత్రకు భారీ భద్రతను కల్పిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Viral Video: కట్నం ఇచ్చి మరీ ఆడమేకతో కల్యాణం.. కారణమేంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..
High Cholesterol Level: అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే ఈ పండ్లను డైట్‌లో చేర్చుకోవాల్సిందే..