కరోనా.. కేరళలో మరో కేసు.. భారత్ మరింత అప్రమత్తం

ఇండియాలో మెల్లగా  కరోనా లక్షణాలు విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేరళలో అప్పుడే రెండో కేసు నమోదైంది. చైనా నుంచి గత నెల కేరళ తిరిగి వచ్చిన ఈ వ్యక్తి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, ఎప్పటికప్పుడు ఐసొలేషన్ వార్డులో ఆ వ్యక్తిని నిశితంగా గమనిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.ఈ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు గతనెల 30 న వెలుగులోకి వచ్చింది. వూహాన్ సిటీలో చదువుతున్న […]

కరోనా.. కేరళలో మరో కేసు.. భారత్ మరింత అప్రమత్తం

ఇండియాలో మెల్లగా  కరోనా లక్షణాలు విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేరళలో అప్పుడే రెండో కేసు నమోదైంది. చైనా నుంచి గత నెల కేరళ తిరిగి వచ్చిన ఈ వ్యక్తి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, ఎప్పటికప్పుడు ఐసొలేషన్ వార్డులో ఆ వ్యక్తిని నిశితంగా గమనిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.ఈ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు గతనెల 30 న వెలుగులోకి వచ్చింది. వూహాన్ సిటీలో చదువుతున్న ఆ మెడికల్ స్టూడెంట్ ఈ వ్యాధి లక్షణాలతో కేరళ తిరిగి వచ్చింది.

త్రిసూర్ లోని ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కేరళలో కరోనా లక్షణాలు సోకాయని అనుమానిస్తున్న 800 మందిపై వైద్య సంబంధ నిఘా పెట్టారు. వారిని 28 రోజుల పాటు పరీక్షించవలసి ఉంటుంది. కాగా నిన్నటివరకు దేశ వ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో 326 విమానాల నుంచిదిగిన 52 వేల మంది ప్రయాణికులకు స్కానింగ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో సుమారు వందమందిని వివిధ ఆసుపత్రుల్లోని ఐసొలేషన్ వార్డులకు తరలించారు. అటు రెండో విడతగా వూహాన్ సిటీ నుంచి 324 మంది భారతీయులను ఎయిరిండియా విమానంలో తిరిగి ఢిల్లీకి తీసుకువచ్చారు.

Published On - 11:27 am, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu