AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం రూ.19 వేలు!

Hike To Daily Wage Workers: గ్రాడ్యుయేట్లు, రోజు వారీ కూలీలు, క్లర్క్‌లు, సూపర్‌వైజర్లకు.. ఇలా పలు రంగాల్లో పని చేస్తున్న వేతన జీవులందరికి గొప్ప శుభవార్తను అందిస్తూ మూడేళ్ళ క్రిందట ఢిల్లీ గవర్నమెంట్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అమలు చేయాలని సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలను జారీ చేసింది. దీనితో ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం రూ.19 వేలు కానుంది. 2017వ సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం వివిధ రంగాల్లో కార్మికులకు 37% ఇన్‌క్రిమెంట్‌ను పెంచుతూ ఓ నోటిఫికేషన్‌ను […]

సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం రూ.19 వేలు!
Ravi Kiran
|

Updated on: Feb 02, 2020 | 12:26 PM

Share

Hike To Daily Wage Workers: గ్రాడ్యుయేట్లు, రోజు వారీ కూలీలు, క్లర్క్‌లు, సూపర్‌వైజర్లకు.. ఇలా పలు రంగాల్లో పని చేస్తున్న వేతన జీవులందరికి గొప్ప శుభవార్తను అందిస్తూ మూడేళ్ళ క్రిందట ఢిల్లీ గవర్నమెంట్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అమలు చేయాలని సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలను జారీ చేసింది. దీనితో ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం రూ.19 వేలు కానుంది.

2017వ సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం వివిధ రంగాల్లో కార్మికులకు 37% ఇన్‌క్రిమెంట్‌ను పెంచుతూ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే ఈ పెంపు వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్రంలో అనేక సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. దీనిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఇలా రెండేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న ఈ కేసుకు చివరికి మోక్షం దక్కింది.

తాజాగా మార్చి 3, 2017 నాటి నోటిఫికేషన్‌ను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం రూ. 19,572 అందనుంది. అంతేకాక ఈ కేసుకు వ్యతిరేకంగా నమోదైన అపీల్స్ అన్నింటిపై త్వరగా విచారణ చేపట్టి పరిష్కరించాలని హైకోర్టును సూచించింది. ఇక ఈ విజ్ఞప్తులను వివిధ సంస్థలు, ఫ్యాక్టరీ‌ల ఓనర్లు దాఖలు చేశారు. ఆ నోటిఫికేషన్‌లో అనేక నోటిఫైడ్ జాబ్స్‌కు కనీస వేతనాలను నిర్ణయించారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు అందుకుంటున్న వేతనాలను పూర్తిగా సవరించారు. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి..

# నైపుణ్యం లేని కార్మికుడికి – నెలకు రూ.14,842/- 

# సెమీ స్కిల్డ్ వర్కర్‌కి – రూ.16,341/-

# స్కిల్డ్ వర్కర్‌కి  – రూ.17,991/- 

అలాగే క్లర్క్‌లు, సూపర్‌వైజర్లల పోస్టుల్లో ఉన్నవాళ్లకు కనీస వేతనాలు..

# 10వ తరగతి పాసైతే – రూ.16,341/-

# ఇంటర్మీడియట్ విద్యార్హతకు – రూ.17,991/-

# డిగ్రీ, ఆపై విద్యార్హత – రూ.19,572/-

Follow Us
మళ్లీ మత్తు బారిన మహానగరం.. దడ పుట్టి డ్రగ్స్..!
మళ్లీ మత్తు బారిన మహానగరం.. దడ పుట్టి డ్రగ్స్..!
భారత్‌‌లో ప్రత్యక్షమైన ఇరాన్‌ మంత్రి సయ్యద్‌ ఖతీబ్‌జాదా..!
భారత్‌‌లో ప్రత్యక్షమైన ఇరాన్‌ మంత్రి సయ్యద్‌ ఖతీబ్‌జాదా..!
తెలంగాణ సల్ల చారు..! ఇలా చేసి తింటే.. సమ్మర్ కూడా కూల్ అయిపోద్ది.
తెలంగాణ సల్ల చారు..! ఇలా చేసి తింటే.. సమ్మర్ కూడా కూల్ అయిపోద్ది.
గల్ఫ్‌లో బాంబుల మోత.. సామాన్యుడి గుండె గుభేల్..!
గల్ఫ్‌లో బాంబుల మోత.. సామాన్యుడి గుండె గుభేల్..!
ఒకసారి కారు యజమానిగా, మరోసారి డీలర్‌గా.. లక్షలు దోచుకున్న యువకుడు
ఒకసారి కారు యజమానిగా, మరోసారి డీలర్‌గా.. లక్షలు దోచుకున్న యువకుడు
ఇద్దరు భర్తలతో ఇబ్బందులు పడ్డ రాజసులోచన..
ఇద్దరు భర్తలతో ఇబ్బందులు పడ్డ రాజసులోచన..
ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా...? ఈ అద్భుత ప్రదేశాలను మిస్..
ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా...? ఈ అద్భుత ప్రదేశాలను మిస్..
బాలయ్యకు జోడీగా నాలుగోసారి ఆ అందాల ముద్దుగుమ్మ..
బాలయ్యకు జోడీగా నాలుగోసారి ఆ అందాల ముద్దుగుమ్మ..
'బలగం' నటుడి ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న కుటుంబీకులు
'బలగం' నటుడి ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న కుటుంబీకులు
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. భారత్‌ ఏ స్థానం?
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. భారత్‌ ఏ స్థానం?