ముఖానికి పసుపు వాడుతున్నారా? ఈ తప్పులు చేశారంటే..!

Jyothi Gadda

14 october 2026

చర్మ కాంతి కోసం పసుపుతో చేసిన ఫేస్‌ప్యాక్ లేదా స్క్రబ్‌ను 20 నిమిషాలకు మించి ఉంచుకోకూడదు.

ఎక్కువ సేపు ప్యాక్ ఉంచితే ముఖంపై పసుపు రంగు మచ్చలు పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పసుపు ప్యాక్ తొలగించేటప్పుడు వెంటనే సబ్బుతో ముఖాన్ని రుద్ది కడుక్కోవడం అస్సలు మంచిది కాదు.

ప్యాక్ తొలగించిన మూడు నాలుగు గంటల తర్వాతే గాఢత తక్కువగా ఉండే ఫేస్‌వాష్‌ ఉపయోగించాలి.

ముఖాన్ని చల్లని నీటితో కడుక్కున్న వెంటనే తగిన మాయిశ్చరైజర్‌ రాసుకోవడం అస్సలు మర్చిపోకూడదు.

పసుపుతో అలెర్జీలు రాకుండా ఉండేందుకు నేరుగా కాకుండా పాలు లేదా రోజ్‌వాటర్ కలిపి వాడాలి.

వంటల్లో వాడే పసుపు కాకుండా చర్మానికి ఉపయోగపడే కస్తూరి పసుపునే ఎంచుకోవడం సురక్షితం.

కొత్తగా పసుపు ప్యాక్ వాడేవారు ముందే ప్యాచ్ టెస్ట్ చేసుకొని నిపుణుల సలహాలు పాటించాలి.