Marriage Election: ప్రజల కోరిక మేరకు ఎన్నికల కోసం యువకుడు పెళ్లి.. వధువుకి పదవిని గిఫ్ట్‌గా ఇస్తానంటున్న నవవరుడు

|

Apr 23, 2023 | 9:30 AM

ఓ యువకుడు కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్నాడు. అయితే అధికారులు అతని ఆశలపై నీళ్లు చల్లారు. యువకుడు పోటీ చేయాలనుకున్న ఆ పోస్టును మహిళలకు కేటాయించారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఎన్నికల కోసం ఓ వ్యక్తి పెళ్లి పీటలెక్కాడు. నామినేషన్ల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఓ ఇంటి వాడయ్యాడు.

Marriage Election: ప్రజల కోరిక మేరకు ఎన్నికల కోసం యువకుడు పెళ్లి..  వధువుకి పదవిని గిఫ్ట్‌గా ఇస్తానంటున్న నవవరుడు
Marriage For The Election!
Follow us on

సినిమాల్లో లేదా నవల్స్ లో అమెరికా వెళ్లడానికో, లేక ఇంటి అద్దె కోసమో.. పరిస్థితుల ప్రభావంతో అప్పటి కప్పుడు పెళ్లి చేసుకున్న సంఘటనలు చూపిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ఓ సంఘటన నిజ జీవితంలో చోటు చేసుకుంది.. అయితే ఆ యువకుడు ఎన్నికల్లో పోటీ చేయడం కోసం అప్పటికప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత ఘటనకు వేదికగా మారింది ఉత్తర్ ప్రదేశ్.

ఓ యువకుడు కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్నాడు. అయితే అధికారులు అతని ఆశలపై నీళ్లు చల్లారు. యువకుడు పోటీ చేయాలనుకున్న ఆ పోస్టును మహిళలకు కేటాయించారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఎన్నికల కోసం ఓ వ్యక్తి పెళ్లి పీటలెక్కాడు. నామినేషన్ల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఓ ఇంటి వాడయ్యాడు. తన భార్యతో నామినేట్ అయ్యాడు.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలోకి వెళ్తే.. త్వరలో పిలిభిత్ మున్సిపల్టీ  కౌన్సిల్‌కు ఎన్నికలు జరగనున్నాయి. 16వ వార్డ్ కౌన్సలర్ గా అవతార్ సింగ్ అనే వ్యక్తి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. ఇప్పుడు కూడా తానే మళ్లీ ఈ స్థానం నుంచి పోటీ చేయాలనీ భావించాడు అవతార్. అంతేకాదు స్థానికులు కూడా అవతార్ నే మళ్ళీ కౌన్సలర్ గా కూడా కోరుకుంటున్నారు. అతనికి ఆశకి కళ్లెం వేస్తూ ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. ఎందుకంటే పిలిభిత్ మున్సిపల్టిలోని 16వ వార్డ్ ను మహిళలకు రిజర్వ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ  విషయం తెలిసిన వెంటనే వార్డ్ ప్రజల్లో నిరాస నెలకొంది. నిరుత్సాహానికి గురయ్యారు. అయితే అవతార్ ఇంటి నుంచి ఎవరినైనా పోటీకి దింపాలని అవతార్ సింగ్‌కు సూచించారు వార్డు ప్రజలు. దీంతో అవతార్   పెళ్లి చేసుకుని భార్యను ఎన్నికల పోటీల్లో నిలబెట్టాలని ఆలోచించాడు. దీంతో శుక్రవారం అవతార్ పెళ్లి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. నామినేషన్ల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు.. కుటుంబసభ్యులు, ప్రజల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

పెళ్లి చేసుకున్న అనంతరం తన భార్యతో  16వ వార్డ్ కౌన్సలర్ గా నామినేషన్ వేయించాడు. కౌన్సిలర్ పదవిని తన భార్యకు కానుకగా ఇస్తానని అవతార్ తెలిపాడు. ప్రజలు కూడా అవతార్ కోరికను తీరుస్తామని అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..