SC Railway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పెరిగిన రైలు వేగం.. ఇకపై ప్రయాణం మరింత ఈజీ

|

Sep 12, 2022 | 8:03 AM

ఈ సెక్షన్లలో గరిష్ట వేగం అనుమతులు లభించిన ఫలితంగా ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్ల సగటు వేగం కూడా పెరుగుతుంది. ఇది రైళ్ల సమయపాలనపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది.

SC Railway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పెరిగిన రైలు వేగం.. ఇకపై ప్రయాణం మరింత ఈజీ
Trains
Follow us on

SC Railway: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే రైళ్ల వేగం పెరగనుంది. సికింద్రాబాద్‌,విజయవాడ, గుంతకల్ రైల్వే డివిజన్లలోలోని అత్యధిక సెక్షన్లలో సర్వీసులకు గంటకు గరిష్టంగా 130 కిమీల మేగంతో నడపడానికి అనుమతించడంతో రైళ్ల వేగంలో జోన్‌ మరో మైలురాయిని అధిగమించింది. ఈ మేరకు రైళ్ల వేగాన్ని పెంచుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. విజయవాడ డివిజన్ పరిధిలోని కొండపల్లి-గూడూరు, గుంతకల్ డివిజన్‌లోని రేణిగుంట-గుంతకల్ సెక్షన్లలో రైళ్ల రద్దీ అధికంగా ఉండటంతో.. రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచి రైళ్లను వేగవంతం చేయాలని 2020లో నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇటీవల రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంపొందించారు. ఈ సెక్షన్లలో అభివృద్ధి పనులు విస్తృతంగా చేపట్టాక రైళ్ల సర్వీసులను 12 సెప్టెంబర్‌ 2022 తేదీ నుండి గంటకు 110 కిమీల నుండి పెంచుతూ 130 కిమీల వేగంతో నడపడానికి ఇప్పుడు అనుమతులు ఇవ్వబడ్డాయి.

ఈ సెక్షన్లలో గరిష్ట వేగం అనుమతులు లభించిన ఫలితంగా ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్ల సగటు వేగం కూడా పెరుగుతుంది. ఇది రైళ్ల సమయపాలనపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది. ప్రధానంగా, గరిష్ట వేగం అనుమతితో ముఖ్యమైన, రద్దీ అయిన ఈ ప్రాంతాలలో సెక్షనల్‌ సామర్థ్యం పెరుగుతుంది.

సికింద్రాబాద్‌ డివిజన్‌లోని సికింద్రాబాద్‌`కాజీపేట్‌`బల్లార్ష, కాజీపేట్‌`కొండపల్లి సెక్షన్లు, విజయవాడ డివిజన్‌లోని కొండపల్లి`విజయవాడ`గూడూరు, గుంతకల్‌ డివిజన్‌లోని రేణిగుంట`గుంతకల్‌`వాడి సెక్షన్లు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ సెక్షన్లు మొత్తం రద్దీగా ఉంటాయి, స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ మార్గాలుగా ఉన్నాయి. వీటిలో స్వర్ణ వికర్ణ మార్గంలో విజయవాడ ` దువ్వాడ మధ్య సెక్షన్‌ను మినహాయించబడిరది. ఇక్కడ వేగం పెంపుకు సంబంధించిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, 130 కిలోమీటర్ల వేగం ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలున్న రైళ్లకే పరిమితం కానుంది. పాతతరం ఐసీఎఫ్ కోచ్‌ల సామర్థ్యం ఉన్న రైళ్ల సామర్థ్యం గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్లే. గోదావరి, గోల్కొండ, నారాయణాద్రి, రాయలసీమ, తెలంగాణ, తిరుపతి-జమ్ముతావి హమ్‌సఫర్, లింగపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ, దక్షిణ్, చార్మినార్, గుంటూరు ఇంటర్‌సిటీ, జైపుర్, ఎల్‌టీటీ దురంతో, కాగజ్‌నగర్, విశాఖపట్నం డబుల్ డెక్కర్, ధర్మవరం, కోకనాడ సహా 37 రైళ్లే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తున్నాయి.

జోన్‌లో గంటకు 130 కిమీల సెక్షనల్‌ వేగం పెంపుకు సంబంధించన పనులను పూర్తి చేయడంలో నిరంతరం కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు, సిబ్బంది బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సెక్షనల్‌ వేగం పెంపుతో ప్రయాణికుల రైళ్ల రవాణా సమయం గణనీయంగా తగ్గుతుందని, రైలు సజావుగా సాగేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి