AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నారిపై అత్యాచారం కేసులో ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష.. సహకరించిన టీచర్‌కు జీవితఖైదు.. పాట్నా కోర్టు సంచలన తీర్పు

పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఓ కీచక ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష పడింది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది.

చిన్నారిపై అత్యాచారం కేసులో ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష.. సహకరించిన టీచర్‌కు జీవితఖైదు.. పాట్నా కోర్టు సంచలన తీర్పు
Balaraju Goud
|

Updated on: Feb 16, 2021 | 8:17 PM

Share

Death Sentence for Rape Case : ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడ్డ కామాంధుల్లో మార్పు రావడంతో లేదు. అత్యాచారం కేసులో పాట్నా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ మానవ మృగానికి ఉరిశిక్ష విధించింది. పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఓ కీచక ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష పడింది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. నిందితుడికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి కోర్టు జీవితఖైదు విధించింది. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి అవధేశ్‌ కుమార్‌ ఈ మేరకు తీర్పు చెప్పింది.

కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫుల్వారీ షరీఫ్‌ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 2018 సెప్టెంబరులో బాధిత చిన్నారి తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో ఆమె తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. అప్పుడు ఆ బాలిక గర్భవతి అని నిర్ధారణ కావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కుటుంబసభ్యలు మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. పాఠశాల ప్రిన్సిపాల్‌ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలావుంటే, బాలిక చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్‌ అరవింద్‌ కుమార్‌ ఆమెపై అత్యాచారం చేయగా, మరో ఉపాధ్యాయుడైన అభిషేక్‌ కుమార్‌ ఈ దుశ్చర్యకు సహకరించాడు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపాల్‌, టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన పాట్నాలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించింది. ప్రిన్సిపాల్‌కు మరణశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. అలాగే, అతడికి సహకరించిన ఉపాధ్యాయుడికి రూ.50వేల జరిమానా, జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. పాట్నాకోర్టు పట్ల మహిళ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీర్పు ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి గుణపాఠం కావాలన్నారు.

Read Also…  Breaking News: మనీ లాండరింగ్ కేసులో రూ. 17 కోట్ల విలువైన ఆస్తుల జప్తు.. ఈడీ దర్యాప్తు..