Sanjay Raut: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు నన్నే సంప్రదించారు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
Sanjay Raut's letter to Venkaiah Naidu: సంచలన ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉండే శివసేన (Shiv Sena) ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చిందేకు కొందరు కుట్ర పన్నుతున్నారంటూ
Sanjay Raut’s letter to Venkaiah Naidu: సంచలన ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉండే శివసేన (Shiv Sena) ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చిందేకు కొందరు కుట్ర పన్నుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అందుకు తననే సంప్రదించారంటూ సంజయ్ రౌత్ హాట్ కామెంట్స్ చేశారు. మహరాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు కుట్రపన్నుతున్నారని.. అందుకు సహకరించకపోతే జైలుకు పంపుతామంటూ తనను బెదిరించారని సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆరోపించారు. ఇదే విషయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ( Venkaiah Naidu) కి లేఖ రాశారు సంజయ్. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను లొంగబోనని స్పష్టం చేశారు. ఎవరికీ తల వంచేది లేదని, నిజాన్ని నిర్భయంగా బయటపెడతానంటూ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.
తనను బెదించడమే కాకుండా మహరాష్ట్ర కేబినెట్‌లోని ఇద్దరు సీనియర్ మంత్రులు, సీనియర్ నేతలను కూడా బెదిరించారని లేఖలో తెలిపారు సంజయ్. వారిపై మనీ లాండరింగ్ కేసులు పెట్టి కటకటాల్లోకి నెడుతామని హెచ్చరించారని ఆరోపించారు. వాళ్ల కుట్రలు, కుతంత్రాలకు తాను లొంగలేదని..రైల్వే మాజీ మంత్రిలా జైలు పాలు చేస్తామని బెదిరించినా భయపడలేదన్ని గుర్తు చేశారు సంజయ్. 17 ఏళ్ల క్రితం తన కుటుంబసభ్యులు అలీబాగ్‌లో ఎకరం భూమి కొనుగోలు చేసిందని.. భూమి అమ్మినవారిని ఈడీ అధికారులు ఇప్పుడు బెదిరిస్తున్నారన్నారు.
తనకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వాలని వారిపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారంటూ సంజయ్ పేర్కొన్నారు. చివరకు తన కుమార్తె వివాహం నిర్వహించిన ఈవెంట్ ఆర్గనైజర్లు, డెకరేటర్లకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయాన్ని సంజయ్ గుర్తు చేశారు. తనకు వ్యతిరేకంగా వారితో మాట్లాడించేందుకు ఈడీ ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తోందని లేఖలో తెలిపారు సంజయ్ రౌత్. ఈ లేఖ ట్రయల్ మాత్రమేనని, బీజేపీ క్రిమినల్ సిండికేట్‌ను ఈడీ అధికారులు ఎలా నడుతుపుతున్నారో త్వరలోనే బయటపెడుతానంటూ శివసేన ఎంపీ సంజయ్ పేర్కొన్నారు.
Also Read: