ఎయిర్ మార్షల్ సాధన సక్సేనా, ఎయిర్ మార్షల్ కేపీ నాయర్ చరిత్ర సృష్టించారు. భారత వైమానిక దళానికి చెందిన తొలి ఎయిర్ మార్షల్ దంపతులు వీరిద్దరూ. ఐఏఎస్ భార్యాభర్తలు, డాక్టర్ దంపతుల గురించి మీరు ఇప్పటి వరకు వినే ఉంటారు. అయితే భార్యాభర్తలు ఎయిర్ మార్షల్ జంటగా ఘనత సాధించడం ఇదే తొలిసారి. వృత్తిరీత్యా వైద్యురాలు సాధనా సక్సేనా సోమవారం ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హాస్పిటల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సాధనా సక్సేనా భర్త ఫైటర్ పైలట్. ఎయిర్ మార్షల్ KP నాయర్ 2015లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పదవి నుండి పదవీ విరమణ చేశారు. ఈ విధంగా వీరిద్దరూ ఎయిర్ మార్షల్ పదవిని చేపట్టి దేశంలోనే తొలి జంటగా చరిత్ర సృష్టించారు.
సాధన ఆమె కుటుంబం నుండి వైమానిక దళంలో పనిచేస్తున్న ఏకైక వ్యక్తి కాదు. గత మూడు తరాలుగా సాధన కుటుంబానికి సైన్యంతో అనుబంధం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రికార్డుల ప్రకారం ఎయిర్ మార్షల్ సాధనా నాయర్ కుటుంబంలోని మూడు తరాల వారు సైన్యంలో పని చేశారు. సాధనా సక్సేనా తండ్రి, సోదరుడు సైన్యంలో వైద్యులు. ఇప్పుడు మూడవ తరం సాధన సోదరుడి కుమారుడు భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఈ విధంగా సాధన కుటుంబం గత 7 దశాబ్దాలుగా భారత వైమానిక దళంలో సేవలందిస్తున్నారు.
ఎయిర్ మార్షల్ సాధనా నాయర్ వైమానిక దళం నుండి ఎయిర్ మార్షల్ పదవికి పదోన్నతి పొందిన రెండవ మహిళ. దీనికి ముందు సాధన నాయర్ బెంగళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్‌లో ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసింది. దేశపు తొలి మహిళా ఎయిర్ మార్షల్‌గా రికార్డు పద్మ బందోపాధ్యాయ (రిటైర్డ్) పేరిట ఉంది.
ఎయిర్ మార్షల్ సాధనా నాయర్ పూణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుండి పట్టభద్రురాలయింది. అనంతరం ఫ్యామిలీ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. డిసెంబర్ 1995లో భారత వైమానిక దళంలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. సాధన న్యూఢిల్లీలోని AIIMSలో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్‌లో 2 సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. అంతేకాదు ఆమె స్విట్జర్లాండ్ నుండి CBRN (కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్) వార్‌ఫేర్, మిలిటరీ మెడికల్ ఎథిక్స్‌లో కోర్సు పూర్తి చేశారు.
ఈ దంపతులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత వైమానిక దళంలో చరిత్ర సృష్టించిన ఈ జంటకు సెల్యూట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మహిళా వైద్యాధికారులు మొదటి నుండి సాయుధ దళాల్లో శాశ్వత కమీషన్ పొందుతున్నారు. అయితే ఇతర విభాగాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ లింగ అసమానతను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని తర్వాత ఇప్పుడు మహిళా అధికారులు కూడా యుద్ధ విమానాలను నడుపుతున్నారు. యుద్ధనౌకలపై పనిచేస్తున్నారు. ఆమె ఆర్టిలరీ రెజిమెంట్‌లోని హోవిట్జర్, రాకెట్ సిస్టమ్‌లకు కమాండ్ చేస్తోంది. ఆమె ఇతర మహిళలకు కూడా స్ఫూర్తినిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..