ఏడాదిలోగా నన్ను సీఎం ని చేయండి.. సచిన్ పైలట్ డిమాండ్
ఏడాదిలోగా తనను రాజస్తాన్ ముఖ్యమంత్రిని చేయాలని డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ డిమాండ్ చేస్తున్నారు. తన కోర్కెను ఆమోదించేంతవరకు కాంగ్రెస్ అధినాయకులతో..ముఖ్యంగా రాహుల్, ప్రియాంక గాంధీలతో తను భేటీ అయ్యే ప్రసక్తే లేదని..
ఏడాదిలోగా తనను రాజస్తాన్ ముఖ్యమంత్రిని చేయాలని డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ డిమాండ్ చేస్తున్నారు. తన కోర్కెను ఆమోదించేంతవరకు కాంగ్రెస్ అధినాయకులతో..ముఖ్యంగా రాహుల్, ప్రియాంక గాంధీలతో తను భేటీ అయ్యే ప్రసక్తే లేదని ఆయన అంటున్నారు. పైలట్ ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారని వచ్చినవార్తలను ఆయన వర్గం తోసిపుచ్చింది. సంవత్సరం లోగా నన్ను ముఖ్యమంత్రిని చేస్తానని బహిరంగంగా ప్రకటించాలని సచిన్ కోరుతున్నారు. ఈ నా డిమాండును ఒప్పుకోకపోతే మా నేతలతో నేను భేటీ అయి కూడా ప్రయోజనం ఉండదు అని పైలట్ పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా అధిష్టానమే మాట్లాడుతున్నప్పుడు ఈ సమావేశాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అయితే ప్రియాంక గాంధీ ఆయనను బుజ్జగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అటు.. తమ నేత బీజేపీలో చేరే ప్రసక్తే లేదని సచిన్ పైలట్ వర్గం స్పష్టం చేసింది.