విధులకు హాజరు‌ కాకపోతే.. రిటైర్మెంటే గతి..!

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలలో తప్పనిసరి పదవీ విరమణ కోసం ఉద్యోగులను పరీక్షించే ప్రక్రియను ప్రారంభించింది. విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులు ఇక రిటైర్ కావాల్సిందేనని

విధులకు హాజరు‌ కాకపోతే.. రిటైర్మెంటే గతి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 18, 2020 | 12:34 PM

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలలో తప్పనిసరి పదవీ విరమణ కోసం ఉద్యోగులను పరీక్షించే ప్రక్రియను ప్రారంభించింది. విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులు ఇక రిటైర్ కావాల్సిందేనని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని కోసం ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మే నెలలో ఒక సమావేశం జరిగింది. 50 ఏళ్ళు పైబడిన ఉద్యోగులు, పలు కారణాలతో సుదీర్ఘ కాలం సెలవుల్లో ఉన్నవారు తప్పని సరిగా పదవీ విరమణ చేయాల్సిందేనని ఈ సందర్భంగా నిర్ణయించారు. అలాంటి ఉద్యోగుల జాబితాను తయారు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

కాగా.. కోవిద్-19 నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ రాష్ట్ర అదనపు కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. గత 40 ఏళ్ళుగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రక్రియేనని ఆయన చెప్పారు. ప్రతి ఏటా జూన్, జూలై నెలలో ఈ మేరకు అన్ని శాఖలకు నోటీసులు జారీ చేయడం సాధారణమేనని ఆయన వివరించారు. తప్పనిసరిగా రిటైర్‌మెంట్ కోరే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందన్నారు.