Sabarimala Ayyappa Temple: తెరుచుకున్న శబరిమల ఆలయం.. కరోనా నెగిటివ్‌ రిపోర్టుతో వస్తేనే భక్తులకు అనుమతి

Sabarimala Ayyappa Temple కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం తెరుచుకుంది. గురువారం ఉదయం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి..

Sabarimala Ayyappa Temple: తెరుచుకున్న శబరిమల ఆలయం.. కరోనా నెగిటివ్‌ రిపోర్టుతో వస్తేనే భక్తులకు అనుమతి
Follow us
Subhash Goud

|

Updated on: Dec 30, 2020 | 9:03 PM

Sabarimala Ayyappa Temple కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం తెరుచుకుంది. గురువారం ఉదయం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. జనవరి 14న మకరవిళక్కు వస్తుంది. అనంతరం జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు. కరోనా నిబంధనల కారణంగా మకరవిళక్కు సీజన్‌లో రోజుకు కేవలం 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతించనున్నాయి.

అయితే ముందుగా రోజుకు 2 వేల మంది భక్తులను మాత్రమే అనుమతి ఉండేది. కోర్టు అనుమతితో భక్తుల సంఖ్య పెంచారు. అయితే దర్శనానికి వచ్చే అయ్యప్ప భక్తులు కోవిడ్‌ -19 నెగిటివ్‌ రిపోర్టుతో వస్తేను అయ్యప్ప దర్శనానికి అనుమతి ఇస్తారు. కోవిడ్‌ ఉన్నందున దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. అలాగే శబరిమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే అనుతించరు. కాగా, కరోనా నేపథ్యంలో ఈ సారి దీక్షలు సైతం తక్కువగానే వేశారు. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది తక్కువ మంది భక్తులు మలాధారణ వేశారు.

Strain Virus Tension: న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ.!