హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ సమక్షంలోనే పోలీసుల ఘర్షణలు.. …షాక్ తిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలోనే బుధవారం పోలీసు అధికారులు ఘర్షణలకు దిగారు.దీంతో కొద్ది సేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ సమక్షంలోనే పోలీసుల ఘర్షణలు.. ...షాక్ తిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Ruckus During Nitin Gadkari
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 23, 2021 | 11:40 PM

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలోనే బుధవారం పోలీసు అధికారులు ఘర్షణలకు దిగారు.దీంతో కొద్ది సేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నితిన్ గడ్కరీ మూడు రోజుల పర్యటనకు గాను భుంటార్ విమానాశ్రయంలో దిగిన కొద్దిసేపటికే ఈ ఘర్షణ జరిగింది. సీఎం పర్సనల్ సెక్యూరిటీ అధికారులు..పోలీసులు పరస్పరం కొట్టుకున్నారు. కుల్లు ఎస్ పీ గౌరవ్ సింగ్….అదనపు ఎస్ పీ, సీఎం సెక్యూరిటీ అధికారి బ్రిజేష్ సూర్ తదితరులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. మండి-కుల్లు నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం భూస్వాదీనానికి జరుగుతున్న యత్నాలను నిరసిస్తున్న స్థానికులను ఇక్కడికి ఎందుకు అనుమతించారంటూ ముల్లు ఎస్ పీ గౌరవ్ సింగ్ అదనపు ఎస్ పీని చెంప దెబ్బ కొట్టారు. దాంతో సహించలేని ఆయన కూడా తిరగబడి ఆయనను కాలితో తన్నారు. వీరి ఘర్షణల తాలూకు వీడియో వైరల్ అయింది.

కారులో ఉన్న నితిన్ గడ్కరీ… సీఎం జై రామ్ ఠాకూర్ తమ కళ్ళ ముందు జరుగుతున్న ఈ ఘ్జర్షణను చూసి షాక్ తిన్నారు. వారి నోటివెంట మాట రాలేదు. కాగా ఘర్షణలకు దిగిన పోలీసు అధికారులను, సీఎం సెక్యూరిటీ సిబ్బంధిని డీజీపీ.. విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. క్రమశిక్షణతో, బాధ్యతా యుతంగా ఉండాల్సిన పోలీసు అధికారులే ఇలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, శాఖా పరమైన విచారణ పూర్తి అయ్యేంతవరకు సస్పెండ్ చేస్తున్నామని ఆయన తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించ్జి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: డ్రగ్స్ కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

Family Man: సమంత కష్టానికి ఫలితం.. వరల్డ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన వెబ్ సిరీస్‌… ( వీడియో )