AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రగ్స్ కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

డ్రగ్స్ కేసులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

డ్రగ్స్ కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
Iqbal Kaskar
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 23, 2021 | 11:36 PM

Share

డ్రగ్స్ కేసులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని ఇంటరాగేట్ చేయడం ప్రారంభించారు. ఇతడికి ముంబైలో పలు గ్యాంగ్ స్టర్లతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు. గతంలో కూడా ఇతడిని విచారించామని వారు చెప్పారు. ఈ ఏడాది కాలంలో ఇతఁడు ఎవరెవరికి డ్రగ్స్ సప్లయ్ చేశాడో..వారి వివరాలను వారు తెలుసుకుంటున్నారు. ఇటీవలే ఇతని కొడుకు రిజ్వాన్ ను యాంటీ ఎక్స్ టార్షన్ విభాగం అధికారులు అరెస్టు చేశారు. అతడు దేశం వదిలి పారిపోతుండగా పట్టుకున్నట్టు వారు తెలిపారు. కస్కర్ మహారాష్ట్రలో ఓ బిల్డర్ నుంచి డబ్బు వసూలు చేశాడన్న ఆరోపణపై ఈడీ ఇతనిపై మనీ లాండరింగ్ కేసు పెట్టింది. ఇతడి పైనే గాక చోటా షకీల్, మరికొందరిపై కూడా ముంబై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసినట్టు తెలిసింది.

కాగా- 2003 లో కస్కర్ ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియాకు అప్పగించింది. ఇతగాడు ముంబైలో తన సోదరుడి రియల్ ఎస్టేట్ వ్యవహారాలను చూస్తూ వచ్చాడు. ఇతనిపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం కింద కూడా అధికారులు కేసు పెట్టారు.అటు-డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు..జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ కు దొంగరవాణా అవుతున్న 25 కేజీల చరస్ ను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ యవ్వారం కూడా కస్కర్ పాత్ర ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Family Man: సమంత కష్టానికి ఫలితం.. వరల్డ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన వెబ్ సిరీస్‌… ( వీడియో )

Hibiscus Herbal Tea: మందారం టీ రోజు తాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో… ( వీడియో )