రూ.2.9 కోట్ల రుణం, అనిల్ అంబానీకి ఎస్ బ్యాంకు నోటీసు
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కి తాము ఇచ్చిన రూ.2,892 కోట్ల రుణాన్ని రాబట్టుకునేందుకు ఎస్ బ్యాంకు ఓ నోటీసును జారీ చేసింది. శాంతాక్రజ్ లోని రిలయెన్స్ గ్రూప్..
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కి తాము ఇచ్చిన రూ.2,892 కోట్ల రుణాన్ని రాబట్టుకునేందుకు ఎస్ బ్యాంకు ఓ నోటీసును జారీ చేసింది. శాంతాక్రజ్ లోని రిలయెన్స్ గ్రూప్ ప్రధానకార్యాలయాన్ని, దక్షిణ ముంబైలోని మరో రెండు కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటామని ఈనోటీసులొ పేర్కొంది. అలాగే నాగిన్ మహల్ లో రెండు ఆఫీసు ఫ్లోర్లను కూడా టేకోవర్ చేస్తామని తెలిపింది. డిఫాల్టర్ల ఆస్తులను విక్రయించేందుకు చట్టప్రకారం తామీ చర్య తీసుకుంటున్నట్టు ఈ బ్యాంకు వెల్లడించింది.
శాంతాక్రజ్ లోని ఈ ప్రధాన కార్యాలయం 21,432 చదరపు మీటర్ల స్థలంలో ఉంది. రెండు దశాబ్దాల క్రితమే ఇది రిలయెన్స్ కి వారసత్వంగా వచ్చింది. 2018 లో రిలయెన్స్ గ్రూప్ తన కార్యాలయాన్ని శాంతాక్రజ్ కి షిఫ్ట్ చేసింది. ఇందులో వివిధ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వీటి కార్యకలాపాలను కుదించారు. చాలామంది ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసిందిగా సూచించారు.