AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ నెట్ సెన్సేషన్ సింగర్ ‘ పాటకు ‘ కూతురి ట్విస్ట్

కోల్ కతా లోని ఓ రైల్వే స్టేషన్ లో పాటలు పాడుతూ..యాచిస్తూ.. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సాంగ్ ‘ ఏక్ ప్యార్ కా నగ్మా హై ‘ పాటతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో.. ఇంటర్నెట్ సెన్సేషన్ అయిన రేణు మొండాల్ కథలో ఓ ట్విస్ట్.. ఈమె కూతురు ఎలిజెబెత్ సతి రాయ్ సరికొత్త విషయాలను మీడియాతో పంచుకుంది. తన తల్లికి నలుగురు సంతానమని, వారిలో తాను ఒకరినని ఆమె తెలిపింది.’ నా తల్లి బాగోగులు చూసుకునేందుకు […]

' నెట్ సెన్సేషన్ సింగర్  ' పాటకు ' కూతురి ట్విస్ట్
Anil kumar poka
|

Updated on: Sep 03, 2019 | 5:46 PM

Share

కోల్ కతా లోని ఓ రైల్వే స్టేషన్ లో పాటలు పాడుతూ..యాచిస్తూ.. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సాంగ్ ‘ ఏక్ ప్యార్ కా నగ్మా హై ‘ పాటతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో.. ఇంటర్నెట్ సెన్సేషన్ అయిన రేణు మొండాల్ కథలో ఓ ట్విస్ట్.. ఈమె కూతురు ఎలిజెబెత్ సతి రాయ్ సరికొత్త విషయాలను మీడియాతో పంచుకుంది. తన తల్లికి నలుగురు సంతానమని, వారిలో తాను ఒకరినని ఆమె తెలిపింది.’ నా తల్లి బాగోగులు చూసుకునేందుకు ఎప్పుడు నేను సిధ్ధపడినా.. ఆమె నిరాకరిస్తూ వచ్చింది. రైల్వే స్టేషన్ వద్ద ఆమె పాటలు పాడుతున్న విషయం నాకు తెలియదు. ఒక సందర్భంలో ఆమెకు నేను 200 రూపాయలిచ్చాను.. అప్పుడప్పుడు 500 రూపాయలు కూడా పంపుతూ వచ్చాను. నా భర్త నన్ను వదిలేశాడు. ఓ చిన్న షాపు పెట్టుకుని రోజులు నెట్టుకొస్తున్న నా ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. నేను మాత్రమే నా తల్లి గురించి పట్టించుకోవాలా ? ఇతర పిల్లలు పట్టించుకోనక్కర్లేదా ? ‘ అని ఎలిజెబెత్ ప్రశ్నించింది. అందరూ నన్నే ఎందుకు ఆడిపోసుకుంటారో తెలియడంలేదని ఆమె వాపోయింది. రేణు మొండాల్ మొదటి వివాహం వల్ల తాను పుట్టానని, తన తల్లికి రెండో భర్త కూడా ఉన్నాడని ఆమె చెప్పింది. కొన్ని రోజుల కిందట తన తండ్రి మరణించాడని ఎలిజబెత్ వెల్లడించింది. రేణు మొండాల్ రెండో వివాహం వల్ల పుట్టిన పిల్లలు కూడా ఆమె గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించింది. ‘ నా తల్లి బాగోగులు చూస్తున్న కోల్ కతా లోని ఓ క్లబ్ ఆమెను కలుసుకునేందుకు నన్ను అనుమతించడంలేదు.. పైగా ఆ క్లబ్ వారు నన్ను బెదిరిస్తున్నారు ‘ అని ఆమె తెలిపింది. ఏమైనా.. గాయనిగా పేరు తెచ్చుకుంటున్న రేణు మొండాల్ కు కూతురినైనందుకు గర్వపడుతున్నానని ఎలిజబెత్ పేర్కొంది.

Follow Us