Jal Jeevan Mission: మూడు నెలల్లో కోటికి పైగా నీటి కనెక్షన్లతో సరికొత్త రికార్డ్.. ఎక్కడంటే..
యూపీలో జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ పథకంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం గ్రామాల్లో తాగునీటిని అందిస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని అధిగమించింది. లక్నోలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన నీటిని వినియోగించుకుంటున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని మోసుకొని రాకుండా ఇంటివద్దకే కుళాయి కనెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

యూపీలో జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ పథకంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం గ్రామాల్లో తాగునీటిని అందిస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని అధిగమించింది. లక్నోలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన నీటిని వినియోగించుకుంటున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని మోసుకొని రాకుండా ఇంటివద్దకే కుళాయి కనెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాన పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు అధికారులు. దీంతో 75శాతం గ్రామాలకు నీటి కనెక్షన్లు ఉన్న జాబితాలో చేరింది ఉత్తరప్రదేశ్. రాష్ట్ర వ్యాప్తంగా 2.63 కోట్ల కుటుంబాలకు రక్షిత తాగు నీటి సరఫరా కనెక్షన్లను అందించాలని లక్ష్యంతో వేసిన అడుగులు ఇప్పుడు 75శాతాన్ని అధిగమించినట్లు తెలిపారు అధికారులు. అంటే 1.97 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.
దీని ద్వారా ఒక్కో కుటుంబంలో ఆరేసి మంది సభ్యులు ఉన్నారనుకుంటే దాదాపు 11 కోట్ల మంది గ్రామస్థులు మంచి నీటిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. హర్ ఘర్ నల్ యోజన కింద ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రికార్డులను బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. 2023-24 సంవత్సరానికి గాను కోటికి పైగా నీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. 85 లక్షల కుటుంబాలకు నీటి కుళాయిలు ఇవ్వాలని సంకల్పించినప్పటికీ దీనిని అధిగమించడం గమనార్హం. మూడు నెలల క్రితమే 1.10 కోట్ల కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. మే నెలలో 12 లక్షల 93 వేల కనెక్షన్లు ఇవ్వగా.. మూడు నెలల క్రితం నవంబర్ 2023 నాటికి కోటి 10 లక్షల కనెక్షన్లు ఇవ్వడం సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. 119 శాతం ఎక్కువ నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించారు అధికారులు. మొత్తం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే ఐదు జిల్లాల్లో కుళాయి కనెక్షన్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..