AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rani Rashmoni: బ్రిటిష్ వారిని ఎదిరించి కోల్ కతాలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ధీర వనిత రాణి రష్మోని

Rani Rashmoni: సామజిక కార్యకర్త, బ్రిటిష్ వారిని ఎదిరించి కోల్ కతాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన రాణి రష్మోని జీవితం ఎందరికో ఆదర్శవంతం. రాణి రష్మోని పశ్చిమ బెంగాల్ లోని..

Rani Rashmoni: బ్రిటిష్ వారిని ఎదిరించి కోల్ కతాలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ధీర వనిత రాణి రష్మోని
Rani Rashmoni
Surya Kala
|

Updated on: Jun 27, 2021 | 8:06 AM

Share

Rani Rashmoni: సామజిక కార్యకర్త, బ్రిటిష్ వారిని ఎదిరించి కోల్ కతాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన రాణి రష్మోని జీవితం ఎందరికో ఆదర్శవంతం. రాణి రష్మోని పశ్చిమ బెంగాల్ లోని ఓ పేద కుటుంబంలో 28 సెప్టెంబర్ 1793 న జన్మించింది. చిన్నతనంలోనే రాణి రష్మోని కోల్‌కతాకు చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది. జమీందారు కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త రాజ్ చంద్ర దాస్‌కు మూడవ భార్య గా అడుగు పెట్టింది. రాజ్ చంద్ర విద్యావంతుడు ఆదర్షవంతుఁడు.. దీంతో రాణి రష్మోనికి స్వేచ్ఛ ఇచ్చాడు. దీంతో ఆమె ఆచారాలు, సంప్రాయాలు పేరుతొ ప్రజలను అనుసరిస్తున్న మూఢనమ్మకాలపై పోరాడింది. ప్రజలను చైతన్యవంతులను చేసింది. ఈ దంపతులిద్దరూ కోల్ కతాలో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు.

కోల్ కతాలో బహిరంగ స్నానం కోసం అనేక ఘాట్లు , నగరంలోని వివిధ ప్రాంతాలను కలిపే పక్కా రోడ్లు, తాగునీటి రిజర్వాయర్లు, వృద్ధాప్య గృహాలు వంటి అనేక నిర్మాణానాలను చేశారు. రాజ్ చంద్ర మరణించిన తరువాత, రాణి రష్మోని కుటుంబం యొక్క వ్యాపారంలోకి అడుగు పెట్టింది. అనంతరం రాణి రష్మణి హౌరాలోని గంగానదిపై వంతెనను నిర్మించి ప్రస్తుత కలకత్తా నగరాన్ని నిర్మించారు.

నదిపై పన్ను వసూలు చేయడానికి, దుర్గా పూజ కు కూడా పన్నులు వసులకు బ్రిటిష్ వారిని అనుమతించలేదు. వారితో పోరాడిన ధీర వనిత. కలకత్తాలో దక్షిణాశ్వర్ ఆలయం నిర్మించారు. కలకత్తాలోని గంగా నదిపై బాబు ఘాట్, నీమ్‌తాలా ఘాట్ నిర్మించారు. శ్రీనగర్ లోని శంకరాచార్యుల ఆలయాన్ని పునరుద్ధరించారు. మధురలో కృష్ణ జన్మభూమి గోడను నిర్మించారు. ఢాకాలోని ముస్లిం నవాబు నుండి 2000 హిందువు బానిసలను కొనుగోలు చేసి వారిని స్వేచ్చను ప్రాసాదించారు .రామేశ్వరం నుండి శ్రీలంక దేవాలయాల వరకు బోటు (పడవ) సర్వీసు సేవలను ప్రారంభించారు. కలకత్తా క్రికెట్ స్టేడియం కోరకు భూమిని విరాళంగా ఇచ్చి నిర్మించారు. సువర్ణ రేఖ నది నుండి పూరి వరకు రహదారిని నిర్మించారు. ప్రెసిడెన్సీ కళాశాల మరియు జాతీయ గ్రంథాలయానికి నిధులు ఇచ్చారు.

గొప్ప వ్యక్తిత్వానికి పేరు రాణి రష్మోని. 1793 నుండి 1863 వరకు జీవించారు. ఫిబ్రవరి 1861 లో 68 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు ఎందరికో స్ఫూర్తినిచ్చే రాణి రొష్మిని త్యాగానికి ధైర్యానికి గుర్తుగా భారత నౌకా దళం.. ఒక నౌకకు పేరు పెట్టింది. విశాఖలోని హిందు స్థాన్‌ షిప్‌ యార్డ్‌ తయారు చేసిన. 51 మీటర్ల పొడవైన నౌకకు రాణి రోష్మణి పేరు పెట్టింది. బ్రిటిష్‌ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన రాణి రోష్మణి ధైర్య సాహసాలకు జ్ఞాపకార్ధంగా నౌకకు ఆమె పేరు నామకరణం చేసింది భారత తీర రక్షణ దళం.

Also Read: ఆయుర్వేదంలో తెల్లమద్దికి విశిష్టత స్థానం.. గుండెకు బలాన్ని, ఎముకలకు శక్తిని ఇచ్చే శక్తి దీని సొంతం