భర్త, ఇద్దరు భార్యలు: ఇరువురితో మూడేసి రోజులు.. ఒక రోజు సెలవు.. తర్వాత ఏమైందంటే

అప్పుడెప్పుడో శోభన్ బాబు, వాణిశ్రీ,, శారదా హీరో హీరోయిన్లుగా నటించిన ఏమండి ఆవిడొచ్చింది!.. సినిమా గుర్తుందా.. అందులో ఒక భర్త, ఇద్దరు భార్యలు .. భర్తను చేరో మూడురోజులు పంచుకున్న భార్యలు.. ఒక రోజు సెలవు ఇచ్చిన కాన్సప్ట్ తో..

భర్త, ఇద్దరు భార్యలు: ఇరువురితో మూడేసి రోజులు.. ఒక రోజు సెలవు.. తర్వాత ఏమైందంటే
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2021 | 3:03 PM

Real Life Emandi Avidochindi : అప్పుడెప్పుడో శోభన్ బాబు, వాణిశ్రీ,, శారదా హీరో హీరోయిన్లుగా నటించిన ఏమండి ఆవిడొచ్చింది!.. సినిమా గుర్తుందా.. అందులో ఒక భర్త, ఇద్దరు భార్యలు .. భర్తను చేరో మూడురోజులు పంచుకున్న భార్యలు.. ఒక రోజు సెలవు ఇచ్చిన కాన్సప్ట్ తో వచ్చి అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అదే సినిమా బాలీవుడ్ లో కూడా తెరక్కింది అనుకోండి.. అయితే అచ్చు ఈ సినిమానే తలపిస్తూ.. జార్ఖండ్ లోని రాంచీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రాంచీలోని కోక్రతిరోల్ రోడ్ లో నివాసం ఉంటున్న రాజేష్ మహాతోకు పెళ్లైంది. ఆ దంపతులకు ఒక బిడ్డ పుట్టిన అనంతరం పెళ్లి, పిల్ల ఉన్నాడనే విషయం దాచి మరో ప్రేమించి .. ఆ యువతిని పెళ్లి చేసుకుంటానంటూ తీసుకుని పారిపోయాడు.. దీంతో తన భర్త కనిపించడం లేదని రాజేష్ మొదటి భార్య సదర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక అదే సమయంలో తమ కుమార్తెను రాజేష్ కిడ్నప్ చేసి తీసుకెళ్లాడని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజేష్‌ను వెదకడం మొదలు పెట్టారు.

చివరికి నెల రోజుల తర్వాత రాజేష్‌ను అతని ప్రియురాలిని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అప్పటి వరకూ రాజేష్‌కు పెళ్లి అయ్యి ఓ పిల్లాడు ఉన్న సంగతి తెలియని ప్రియురాలికి అసలు విషయం తెలిసింది. వారిని వదిలేసి వచ్చి తనని మోసం చేసి మళ్లీ వివాహం చేసుకున్నాడని తెలుసుకుంది.

దీంతో భర్త, ఇద్దరు భార్య లు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నా మొగుడు నాకే సొంతం అంటూ ఇద్దరు సిగపట్లు పట్టారు.. ఓ రేంజ్‌లో పోలీస్ స్టేషన్‌లో కొట్టుకున్నారు. దీంతో పోలీసులు ఒక సూపర్బ్ ఐడియా ఇచ్చారు ఇద్దరు భార్యలకు సఖ్యత కుదిర్చేందుకు… ఒక రాజీఫార్ములాను ముగ్గురు ముందుంచారు.

రాజేష్ వారంలో 3 రోజులు ఒక భార్య దగ్గర, 3 రోజులు రెండో భార్య దగ్గర ఉండేట్టు, ఒకరోజు అతని ఇష్టానికి వదిలేసేటట్లు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. పోలీసులు చెప్పిన దానికి అంగీకరించి ముగ్గురు రాజీపడి కాగితాల మీద సంతకాలు పెట్టారు.. అనంతరం ఇళ్లకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

అయితే రాజేష్ మొదటి భార్య వద్దకు మూడు రోజులు ఉండదని వెళ్లిన సమయంలో రెండో భార్య మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో భర్త రాజేష్ పై ఫిర్యాదు చేసింది. మొదటి పెళ్లి విషయం దాచి పెట్టి తనను మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాదు.. తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ కోసం మొదటి భార్య ఇంటికి వెళ్లారు. రెండో భార్య కేసు పెట్టిందని తెలుసుకున్న రాజేష్ పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. దీంతో ఈ కేసు ఇప్పుడు కోర్టు కు చేరుకుంది.

రాజేష్ పై అరెస్ట్ వారంట్ జారీ అయ్యింది. పోలీసులు రాజేష్ ను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అతను పారిపోటానికి మొదటి భార్య సహకరించిందని రెండో భార్య ఆరోపిస్తోంది. పరారీలో ఉన్న రాజేష్ ను పట్టుకోటానికి పోలీసులు గాలింపు చేపట్టారు.

Also Read:

 ఎన్నాళ్లకెన్నాళ్లకు ?ఏడాది తరువాత మళ్ళీ పబ్లిక్ గా కనిపించిన కిమ్ భార్య రీ సోల్ జూ

చిక్కుల్లో పడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. ఫెడరల్‌ కోర్టులో కేసు