మళ్ళీ అయోధ్యలో రామాలయ నిర్మాణంపై బీజేపీ ఫోకస్
అయోధ్యలో రామాలయ నిర్మాణం పై ఫోకస్ పెట్టేందుకు అప్పుడే బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తిరిగి ప్రారంభించిన..

అయోధ్యలో రామాలయ నిర్మాణం పై ఫోకస్ పెట్టేందుకు అప్పుడే బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో గోరఖ్ పూర్ లోని ఓ ఆలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఉదయం ప్రార్థనలు నిర్వహించారు. మరో రెండేళ్లలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అయోధ్యలో రామాలయ నిర్మాణం కమలనాథులకు అత్యంత ముఖ్యం. అందువల్లే ఇవాళ రామజన్మ భూమి స్థలం వద్ద ట్రస్టు కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడ అసలు భౌతిక దూరమన్న నిబంధనే కనిపించలేదు.కాగా- కరోనా మహమ్మారి లేకుంటే ఈ పాటికే ఇక్కడ రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగి ఉండేదని రామజన్మ భూమి ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధి, సభ్యుడు కూడా అయిన అనుజ్ ఝా తెలిపారు. పరిస్థితిని బట్టి తేదీని నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.