AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజ్రీవాల్ జీ ! ఢిల్లీవాసులంటే ఎవరు’? చిదంబరం

ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలను ఢిల్లీవాసులకే రిజర్వ్ చేశామంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న చేసిన ప్రకటనపై..

కేజ్రీవాల్ జీ ! ఢిల్లీవాసులంటే ఎవరు'? చిదంబరం
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 08, 2020 | 7:44 PM

ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలను ఢిల్లీవాసులకే రిజర్వ్ చేశామంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న చేసిన ప్రకటనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత పి.చిదంబరం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విధమైన ప్రకటన చేసేముందు కేజ్రీవాల్ న్యాయ నిపుణుల సలహా ఏమైనా తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ వాసులు అంటే ఎవరు ? నేను ఈ నగరంలో నివసిస్తున్నా.. ఇక్కడ పని చేస్తున్నా… అయితే ఢిల్లీ వాసినే అవుతానా అన్నారు. జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ పథకాల కింద తమ పేర్లు నమోదు చేయించుకున్న ఎవరైనా.. ఏ ఆసుపత్రిలోనైనా, ఇండియాలో ఎక్కడైనా చికిత్స పొందవచ్చునని తాను భావిస్తున్నానని చిదంబరం పేర్కొన్నారు. కాగా- ఐదుగురు డాక్టర్లతో కూడిన కమిటీ ఇఛ్చిన సలహా పైనే తానీ ప్రకటన చేసినట్టు కేజ్రీవాల్ నిన్న స్పష్టం చేసిన విషయం గమనార్హం.