Viral: కార్మికులు డ్రైనేజ్ క్లీన్ చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని శుభ్రం చేయగా
వారు సఫాయి కార్మికులు.. గెడ్డలు, కాలవల్లో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి.. ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో నివశించేందుకు పనిచేసే వారియర్స్. వారు నాలుగు రోజులు పనిచేయకపోతే.. ఆ ప్రాంతమంతా దుర్గందంతో అస్తవ్యస్తంగా మారుతుంది. అలాంటి కార్మికులు డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా ఓ వస్తువు మెరుస్తూ కనిపించింది..

మాములుగా అయితే డ్రైనేజ్‌లో ఏమేం ఉంటాం.. హా.. చెత్తా చెదారం వేస్ట్ ఉంటుంది.. అదేం ప్రశ్న అనుకుంటున్నారా..? ఆగడాగండి.. అక్కడికే వస్తున్నాం.. అస్సాం కాచర్ జిల్లాలోని నూతన్‌పట్టి ప్రాంతంలో డ్రైనేజ్ శుభ్రం చేస్తున్న కార్మికులకు ఓ వస్తువు మెరుస్తూ కనిపిస్తుంది. ఏంటా అది అని బయటకు తీసి క్లీన్ చేయగా.. ఓ వెండి దీపం మిల మిల మెరుస్తుంది. రోజువారి పనుల్లో భాగంగా డ్రైనేజ్ కాలువను శుభ్రం చేస్తుండగా, కార్మికుల ఈ సిల్వర్ ల్యాంప్ కనుగొన్నారు. విషయం తెలియడంతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా దాన్ని చూసేందుకు గుమికూడారు. విషయం తెలియడంతో పోలీసులు సైతం.. ఆ ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మార్చి 24న సిల్చార్‌లోని నూతన్‌పట్టి ప్రాంతంలోని డ్రైనేజీలో వెండితో తయారు చేసినట్లు చెప్పబడుతున్న పొడవైన స్టాండ్‌తో కూడిన ఈ నూనె దీపాన్ని కనుగొన్నారు. అయితే ఎవరైనా దాన్ని దొంగతనం చేసి తరలిస్తుండగా.. డ్రైనేజ్‌లో పడిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పైన నెమలి బొమ్మ ఉండే నూనె దీపాలను ఉత్సవాల సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాంటిది మురుగు కాలువను శుభ్రం చేస్తున్నప్పుడు బయటపడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఆ వస్తువును స్వాధీనం చేసుకున్నారు. ఆ దీపం ఎక్కడిది..? ఏ ఆలయంలో అయినా మిస్ అయిందా…? లేదా ఎవరి ఇంటి నుంచైనా దొంగలించబడిందా అనే అంశాలపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
View this post on Instagram