కేంద్రం కీలక నిర్ణయం.. కూలీలు, కార్మికులకు భరోసా !
కరోనా, లాక్‌డౌన్ వలస కూలీలను ఇంటిబాట పట్టేలా చేసింది. దాదాపుగా మూడు నెలల నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు, కార్మికులు సొంతూళ్లకు మళ్లుతున్నారు. ఇన్నాళ్లుగా పలు నగరాలు, పట్టణాల్లో ఉపాధి పొందిన వారు పనిలేక, చేతిలో డబ్బులేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో

కరోనా, లాక్‌డౌన్ వలస కూలీలను ఇంటిబాట పట్టేలా చేసింది. దాదాపుగా మూడు నెలల నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు, కార్మికులు సొంతూళ్లకు మళ్లుతున్నారు. దేశాలు, రాష్ట్రాలు దాటిని వెళ్లిన వారిని కూడా ప్రభుత్వం ప్రత్యేక విమానాలు, జలమార్గాల ద్వారా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇన్నాళ్లుగా పలు నగరాలు, పట్టణాల్లో ఉపాధి పొందిన వారు పనిలేక, చేతిలో డబ్బులేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో కేంద్రం ఇప్పుడు వలస కూలీలు, కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించింది. అందరికీ ఉపాధి కల్పించే దిశగా కసరత్తు చేస్తోంది.
వలస కూలీలు, కార్మికులకు పని కల్పించే దిశగా మోదీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. దేశంలోకి వలస వచ్చిన వారి వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ మేరకు కేంద్రం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ప్రత్యేక కమిటీ వేసినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో కమిటీ నివేదిక అందజేయనుంది. సొంత గ్రామాలకు వచ్చిన వలస కూలీలు, కార్మికుల నైపుణ్యం ఆధారంగా పని కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సాయం కూడా తీసుకోనుంది.