Rajasthan: భారీ వర్షం మధ్య సైక్లిస్టులతో ప్రధాని మోడీ గ్రాండ్ రోడ్ షో.. బారులు తీరిన ప్రజలు

|

Jul 09, 2023 | 8:45 AM

ప్రధాని మోడీ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అవినీతి దుకాణం అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ప్రధాని మోడీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అంతం కాబోతోందని, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతి, నేరాలు, రాజకీయాలకు ఖ్యాతి గడించిందని ఆరోపించారు.

Rajasthan:  భారీ వర్షం మధ్య  సైక్లిస్టులతో ప్రధాని మోడీ గ్రాండ్ రోడ్ షో.. బారులు తీరిన ప్రజలు
Pm Narendra Modi
Follow us on

ప్రధాని మోడీ రాజస్థాన్‌లోని బికనీర్ నగరంలో సైక్లిస్టులతో గ్రాండ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సమయంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. తమ అభిమాన నేతను, ప్రధాని మోడీని  చూసేందుకు ప్రజలు, అభిమానులు రోడ్డుపై గుమిగూడారు. అనంతరం ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోడీ రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అవినీతి దుకాణం అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ప్రధాని మోడీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అంతం కాబోతోందని, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతి, నేరాలు, రాజకీయాలకు ఖ్యాతి గడించిందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఒకటైన జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ అమలులో జాప్యం పట్ల విచారం వ్యక్తం చేశారు మోడీ. ప్రాజెక్ట్ అమలులో ముందు వరుసలో ఉండాల్సిన రాజస్థాన్ ఇప్పుడు వెనుకబడి ఉందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఇలాగే కొనసాగితే దేశాన్ని అంతర్గతంగా బలహీనపరుస్తుందని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బికనీర్‌లో రోడ్‌షో , సైకిల్ ర్యాలీ

అత్యాచార కేసుల్లో రాజస్థాన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ \.. రక్షణ బాధ్యత వహించే వారే వేటగాళ్లుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడం కంటే.. అత్యాచారం, హత్య నిందితులను రక్షించడంపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోందన్నారు.  రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమి అనివార్యం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ఇప్పటికే బైబై చెప్పే మూడ్ లో ఉందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ నేతలు విదేశాలకు వెళ్లినప్పుడు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం విమర్శలకు దారితీసింది. దీనిపై ఓ ర్యాలీలో మాట్లాడిన మోడీ .. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు విదేశాల్లో ఉంటూ భారత్‌ను అవమానించే పనిలో నిమగ్నమై ఉన్నారంటూ మండిపడ్డారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బికనీర్ పర్యటన సందర్భంగా అమృత్‌సర్-జమ్మూ కాశ్మీర్ ఎకనామిక్ కారిడార్ ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ మోటార్‌వేను ప్రారంభించారు. హనుమాన్‌గఢ్ జిల్లాలోని జఖదావలి గ్రామం నుండి జలోర్ జిల్లాలోని ఖెత్లావాస్ గ్రామం వరకు దాదాపు 500 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ రహదారిని సుమారు రూ. 11,125 కోట్ల వ్యయంతో నిర్మించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..