Viral: ఛీ.. ఇదేం పాడు బుద్ది డాక్టరూ.. అర్ధరాత్రి ఫుట్‌పాత్‌ల దగ్గరకు వెళ్లి మరీ..
తమ దగ్గరకి వచ్చిన రోగి ఎవరికైనా కూడా.. వారిని బ్రతికించడమే డాక్టర్ పని. అందుకే పేషెంట్లు.. డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తారు.
తమ దగ్గరకి వచ్చిన రోగి ఎవరికైనా కూడా.. వారిని బ్రతికించడమే డాక్టర్ పని. అందుకే పేషెంట్లు.. డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తారు. అయితే ఇక్కడొక డాక్టర్ తన స్నేహితులతో కలిసి వృత్తికి విరుద్ధం ఓ పాడు పని చేసి పోలీసులకు అడ్డంగా దొరికాడు. ఇంతకీ ఆ డాక్టర్ చేసిన నేరమేంటి.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన ఓ డాక్టర్ అర్ధరాత్రి 2.45 గంటల ప్రాంతంలో బైక్‌లపై తన ముగ్గురి స్నేహితులతో కలిసి వచ్చి ఫుట్‌పాత్ మీద దుప్పట్లు అమ్ముకుంటున్న వ్యాపారి దగ్గర నుంచి 8 దుప్పట్లను దొంగలించి పారిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విషయాన్ని గమనించిన వ్యాపారి వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారాన్ని అందించాడు. దీంతో ఆ ప్రాంతం మొత్తానికి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు ఖాకీలు.
ఇక స్థానికంగా ఉన్న కైలదేవి నేషనల్ పార్క్ దగ్గర నలుగురు యువకులు బైక్‌పై వస్తుండటం పోలీసులు గమనించారు. మొదటిగా వాళ్లు లేట్ నైట్ పార్టీ నుంచి వస్తున్నారనుకున్నారు ఖాకీలు. అయితే పోలీసులను చూడగానే కంగారుపడిన సదరు యువకులు వారి చేతిలోని కవర్లను పడేసి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో.. వాళ్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కాగా, నిందితుల్లో ఒకరు మైనర్ కాగా, మరో ముగ్గురిలో ఒకరు హోమియోపతి డాక్టర్ శైలేంద్ర, అతడి సహచరులు దీపక్, రాహుల్. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు.