AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: కశ్మీర్‌లో పరుగులు పెట్టనున్న వందేభారత్‌ రైలు.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

Vande Bharat Express: త్వరలో వందే భారత్ స్లీపర్ కోచ్, మెట్రో రైలును ప్రారంభించాలని రైల్వే యోచిస్తోంది. వందే భారత్ స్లీపర్ కోచ్, వందే భారత్ మెట్రోలను త్వరలో ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. జమ్ము-శ్రీనగర్‌ రైల్వే లైను పనులు వేగంగా సాగుతున్నాయి. అతి త్వరలోనే అందుబాటులోకి వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలోనే శ్రీనగర్‌ నుంచి వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Vande Bharat: కశ్మీర్‌లో పరుగులు పెట్టనున్న వందేభారత్‌ రైలు.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి
Vande Bharat Trains In Kashmir Soon
Sanjay Kasula
|

Updated on: Oct 20, 2023 | 8:57 AM

Share

వందే భారత్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. అలాగే, త్వరలో వందే భారత్ స్లీపర్ కోచ్, మెట్రో రైలును ప్రారంభించాలని రైల్వే యోచిస్తోంది. వందే భారత్ స్లీపర్ కోచ్, వందే భారత్ మెట్రోలను త్వరలో ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. జమ్ము-శ్రీనగర్‌ రైల్వే లైను పనులు వేగంగా సాగుతున్నాయి. అతి త్వరలోనే అందుబాటులోకి వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలోనే శ్రీనగర్‌ నుంచి వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో రైల్వేలైను విద్యుదీకరణ పనులు పూర్తయిన వెంటనే అక్కడ కూడా వందే భారత్ రైలు దూసుకుపోతుందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది మార్చినాటికి మొత్తం 75 రైళ్లను పట్టాలు ఎక్కించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం దూసుకుపోతోందని తెలిపారు. అలాగే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రత్యామ్నాయంగా సుదూర ప్రాంతాలకు వందే భారత్‌ స్లీపర్‌ వెర్షన్లను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

జమ్ము నుంచి శ్రీనగర్‌ వరకు రైల్వేలైన్‌ పనులు పూర్తి కాగానే వందేభారత్ రైళ్లు ఆ మార్గంలో రాకపోకలు సాగించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. అతి త్వరలోనే వందే భారత్ రైళ్లను పట్టాలు ఎక్కిస్తామన్నారు. నూతన రైళ్లను సాంకేతిక నిపుణులు స్పెషల్ డిజైన్ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు.. ఎత్తయిన, వివిధ రకాల ఉష్ణోగ్రతలు ఉన్న చోట కూడా సజావుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో, జమ్ము కశ్మీర్‌లో రైల్వే లైన్ల అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఆసక్తి చూపిస్తున్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్, మెట్రో రైలును..

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శంతను రాయ్ మాట్లాడుతూ, ప్రతిదీ సరిగ్గా జరిగితే, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నమూనా (వందే భారత్ స్లీపర్ రైలు)తో ప్రపంచ స్థాయి సాటిలేని ప్రయాణ అనుభూతిని అందిస్తాము. BEML మొదటి స్లీపర్ వందే భారత్ రైలును అభివృద్ధి చేయడానికి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై మరియు రైల్వే బోర్డుతో కలిసి పనిచేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..