Vande Bharat Metro: ఇలా వచ్చి.. అలా వెళ్లొచ్చు.. సామాన్యుల కోసం ‘వందే మెట్రో’ ట్రైన్లు.. మోడీ సర్కార్ కీలక నిర్ణయం..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Feb 02, 2023 | 11:41 AM

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వేతన జీవులకు ఊరటనివ్వడంతోపాటు.. రైతులు, నిరుద్యోగులకు, పారిశ్రామికరంగాలకు కేంద్రం అధిక కేటాయింపులు జరిపింది.

Vande Bharat Metro: ఇలా వచ్చి.. అలా వెళ్లొచ్చు.. సామాన్యుల కోసం ‘వందే మెట్రో’ ట్రైన్లు.. మోడీ సర్కార్ కీలక నిర్ణయం..
Vande Bharat Express

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వేతన జీవులకు ఊరటనివ్వడంతోపాటు.. రైతులు, నిరుద్యోగులకు, పారిశ్రామికరంగాలకు కేంద్రం అధిక కేటాయింపులు జరిపింది. కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఇండియన్ రైల్వేకు భారీగా కేటాయింపులు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.2.41 లక్షల కోట్లను కేటాయించింది. 2013-14 సంవత్సరంతో పోలిస్తే ఈ రైల్వే బడ్జెట్ దాదాపు 9 రెట్లు ఎక్కువ.. బడ్జెట్లో అతిపెద్ద కేటాయింపు కూడా ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. రైల్వేకు అధిక కేటాయింపుల అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. పెద్ద నగరాలకు సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు జరిపేందుకు వీలుగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మినీ వెర్షన్ ‘వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు వెసులుబాటుగా, అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వందే భారత్‌ తరహాలోనే ‘వందే మెట్రో’లను కూడా అభివృద్ధి చేస్తున్నామని, డిజైన్, ఉత్పత్తి ఈ ఏడాదే ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు.

పెద్ద నగరాల చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు పనికోసం నగరానికి వచ్చి మళ్లీ తమ స్వస్థలాలకు చేరుకునేలా వందేభారత్‌ మెట్రోని తీసుకురావాలని ప్రధానమంత్రి సంకల్పించారని, దానికనుగుణంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. వందే మెట్రోల రూపకల్పన, తయారీ ఈ ఏడాదే పూర్తవుతుందని.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ రైళ్ల ఉత్పత్తిని సైతం పెంచుతామని రైల్వే మంత్రి అభిప్రాయపడ్డారు.

ఇప్పుడున్న వందే భారత్‌ రైళ్లలో 16 బోగీలున్నాయి. అయితే మెట్రో రైళ్ల మాదిరిగానే ఈ వందే మెట్రోలనూ ఎనిమిది బోగీలు ఉండనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వందే భారత్ మెట్రో డిజైన్, ఉత్పత్తి ఈ సంవత్సరం పూర్తవుతుందని.. ఇవి అందరికీ సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వందే భారత్ మెట్రో ఎలా ఉండనుందంటే..

  • సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్ల స్లీపర్ వెర్షన్‌ను కూడా రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది.
  • ఈ రైళ్లు ఎనిమిది కోచ్‌లతో ఉంటాయి. మెట్రో రైలు లాగా ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉంటాయి.
  • వందే భారత్ మెట్రో ప్రయాణికులకు వేగవంతమైన షటిల్ లాంటి అనుభూతిని కలిగిస్తుంది.
  • ప్రజలు తమ స్వస్థలాల నుంచి పెద్ద నగరాల్లోని కార్యాలయాలకు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వందే మెట్రోను అభివృద్ధి చేస్తున్నారు.
  • చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (RDSO) జనరల్ మేనేజర్‌లను (GMలు) రైల్వే మంత్రిత్వ శాఖ ఎనిమిది కోచ్ ల వందే భారత్ రైళ్ల బోగిల ఉత్పత్పిని త్వరగా ప్రారంభించాలని ఆదేశించింది.
  • వందేభారత్ రైళ్లను తక్కువ కార్ కంపోజిషన్‌తో నడపాలన్న ప్రయాణికుల విన్నపం మేరకు.. ముఖ్యంగా వ్యాపారులు, విద్యార్థులు పెద్ద నగరాలను సందర్శించాలనుకునే శ్రామిక వర్గాల కోసం వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu