Adani Group: అదానీ వ్యవహారంలో బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్..
హిండెన్‌బర్గ్ నివేదిక స్టాక్ మార్కెట్‌లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందన్న హిండెన్ బర్గ్ రిపోర్ట్‌తో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి.
హిండెన్‌బర్గ్ నివేదిక స్టాక్ మార్కెట్‌లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందన్న హిండెన్ బర్గ్ రిపోర్ట్‌తో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతోపాటు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా.. హిండెన్ బర్గ్ నివేదిక సెగ పార్లమెంటుకు కూడా తాకింది. అదానీ గ్రూప్ కంపెనీ అవకతవకలపై చర్చ జరపాలంటూ విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్థానిక బ్యాంకులను కీలక ఆదేశాలిచ్చింది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఎంత మేర రుణాలు తీసుకున్నాయి. వాటి వివరాలను ఇవ్వాలని ఆర్‌బీఐ ప్రభుత్వం, ప్రభుత్వేతర బ్యాంకులకు సూచించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
కాగా, అదానీ గ్రూప్ వ్యవహారం పార్లమెంటుకు తాకింది. దీనిపై విచారణ చేయాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. బీఆర్ఎస్ తరుపున నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరపున మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. రాజ్యసభలో కూడా హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలంటూ కె.కేశవరావు వాయిదా తీర్మానం నోటీస్ అందజేశారు. అదానీ గ్రూప్ అవకతవకలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌పై చర్చించాలని విపక్షాల పట్టుబట్టాయి. 267నిబంధన కింద చర్చించాలని BRS ఎంపీ కే.కేశవరావు కోరారు.
ఆప్, సీపీఎం పార్టీలు కూడా ఇదే అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. దీంతోపాటు చైనాతో సరిహద్దు పరిస్థితిపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..