Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఫుడ్‌ పాయిజన్‌.. ఇండియా కూటమి ర్యాలీలకు దూరం..

|

Apr 21, 2024 | 5:32 PM

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ పర్యటన రద్దయ్యింది. రెండు రాష్ట్రాల్లోని సత్నా, రాంచీలో జరిగే ఇండియా కూటమి మెగా ర్యాలీకి రాహుల్‌ హాజరుకావాల్సి ఉండగా.. ఆయన అస్వస్థతకు గురయ్యారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఆయన పర్యటన రద్దయ్యింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఫుడ్‌ పాయిజన్‌.. ఇండియా కూటమి ర్యాలీలకు దూరం..
Rahul Gandhi
Follow us on

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ పర్యటన రద్దయ్యింది. రెండు రాష్ట్రాల్లోని సత్నా, రాంచీలో జరిగే ఇండియా కూటమి మెగా ర్యాలీకి రాహుల్‌ హాజరుకావాల్సి ఉండగా.. ఆయన అస్వస్థతకు గురయ్యారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఆయన పర్యటన రద్దయ్యింది. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా రాహుల్‌ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. రాహుల్‌కు బదులుగా సాత్నా సభకు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని పార్టీ ఆదివారం వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.‘రాహుల్‌ గాంధీ ఈరోజు సతనా, రాంచీలోని ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. కానీ, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఢిల్లీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సత్నాలో జరగనున్న సభకు హాజరై ప్రసంగిస్తారు’.. అంటూ జైరాం రమేశ్‌ ట్విట్టర్ వేదికగా పోస్ట్‌ చేశారు.

అయితే, రాంచీలో జరగనున్న ఇండియా కూటమి ర్యాలీకి పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆర్జేడీ చీఫ్‌ లాలూ యాదవ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ హాజరుకానున్నట్లు ఇండియా బ్లాక్ నేతలు వెల్లడించారు.

ఇదిలాఉంటే.. గత కొన్ని రోజుల నుంచి వరుసగా రాష్ట్రాల్లో పర్యటిస్తూ రాహుల్ గాంధీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కూటమి నేతలను గెలిపించాలని ప్రజలను కోరుతుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..