AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi Turned Chefs: కొత్త అవతారం ఎత్తి గరిట పట్టిన రాహుల్ .. ఓట్ల కోసం పాట్లు..

ఎన్నికల సమయం దగ్గర పడుతుందంటే రాజకీయ నేతలు ఎన్ని సిత్రాలైన చేస్తారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఏ స్టేజ్ కైనా వెళ్తరు ఏ పనైనా చేస్తారు.. గతంలో పిల్లలకి స్నానం చేయించడం.. కూరగాయలు మోయడం..

Rahul Gandhi Turned Chefs: కొత్త అవతారం ఎత్తి గరిట పట్టిన రాహుల్ .. ఓట్ల కోసం పాట్లు..
Surya Kala
|

Updated on: Jan 31, 2021 | 8:01 AM

Share

Rahul Gandhi Turned Chefs: ఎన్నికల సమయం దగ్గర పడుతుందంటే రాజకీయ నేతలు ఎన్ని సిత్రాలైన చేయిస్తాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి ఏ స్టేజ్ కైనా వెళ్లారు.. గతంలో పిల్లలకీ స్నానము చేయించడం.. కూరగాయలు మోయడం వంటి రాజకీయ నేతలను చూశాం.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గరిటె పట్టారు. పుట్టగొడుగు బిర్యానీ కూడా చేశారు.. మరి ఈ చిత్రం ఎక్కడ జరిగిందో తెలుసా..!

ఇటీవల తమిళనాడు పర్యటన నిమిత్తం వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనలోకి కళా పోషణను బయటకు తీశాడు. పాకశాస్త్రంలో పరీక్షించుకున్నారు. విలేజ్‌ కుకింగ్‌ ఛానల్‌ యూట్యూబ్‌లో టీమ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సరదాగా వారితో కలిసి గరిటతిప్పారు. ఆ తర్వాత మష్‌రూమ్ బిర్యానీని స్థానికులతో కలిసి భోజనం చేశారు. తమిళంలో వారికి కితాబిచ్చారు.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. జనవరి 29 న ఈ వీడియో పోస్ట్ చేయగా.. గంటల వ్యవధిలోనే లక్షల మంది చూశారు. వాళ్లు తయారు చేసిన బిర్యానీ చూస్తుంటేనే నోరూరిస్తోంది. దీనికి తోడు రాహుల్ గాంధీ సంభాషణ అదనపు ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు, వారికి ఆయన అరుదైన అవకాశం కూడా కల్పించబోతుండటం విశేషం. ఓవైపు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు అధికార పార్టీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉండాలని డిసైడ్ అయ్యారు. ప్రజలతో సాధ్యమైనంతవరకు దగ్గరకావడానికి ప్రయత్నిస్తున్నారు.

Also Read: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? గ్రీన్ సిటీ కోసం ఫుట్ పాత్ మీద వృద్ధులను ట్రక్కులో తీసుకెళ్లి..