వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. వైఎస్ఆర్ అసలైన ప్రజా నాయకుడు అని కొనియాడారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. ఆయన మరణం అత్యంత విషాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపి ముఖచిత్రం వేరేలా ఉండేదని.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కి ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావని తెలిపారు. ఆయన వారసత్వాన్ని షర్మిల సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ నమ్మకం తనకు ఉందని ధీమాను వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. వైఎస్ షర్మిల న్యాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు. వైఎస్ఆర్లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, న్యాయకత్వ లక్షణాలు షర్మిలలో తాను చూశానని ఈ సందర్భంగా తెలిపారు. తాను వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. ఆయన పాదయాత్రే తన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి అని తెలిపారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం, వారి కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారని చెప్పారు. అందుకే తనకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. జూలై 8న 75 వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్కు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.
A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g
— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరించేందుకు, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు వైఎస్ షర్మిల అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జూలై 8 ఆయన జయంతిని పురస్కరించుకుని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే మరి కొందరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ జయంతి నుంచే కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ కాంగ్రెస్ గెలుపుకు అనుసరించాల్సిన విధివిధానాలను దిశానిర్ధేశం చేయనున్నారు. కార్యకర్తల్లో సరికొత్త జోష్‌తో పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.