Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు.. ప్రకటించిన లోక్‌సభ.. ఇకపై ఆయన భవిష్యత్‌ ఏటు వైపు..?

|

Mar 24, 2023 | 3:25 PM

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ఎంపీగా చెల్లబాటు కారని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు. ‘మోదీ డీఫేమేషన్’ కేసులో సూరత్ కోర్టు వేసిన రెండేళ్ల శిక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు, ఆపైన శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు.. ప్రకటించిన లోక్‌సభ.. ఇకపై ఆయన భవిష్యత్‌ ఏటు వైపు..?
Rahul Gandhi
Follow us on

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ఎంపీగా చెల్లబాటు కారని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు. ‘మోదీ డీఫేమేషన్’ కేసులో సూరత్ కోర్టు వేసిన రెండేళ్ల శిక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు, ఆపైన శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. ఇక 2019 కర్నాటక ఎన్నికల సందర్భంగా కోలార్ సభలో ‘మోదీ ఇంటిపేరుతో ఉన్నవాళ్లంతా దొంగలు’ అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ పార్టీకి చెందిన సూరత్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పుర్నేష్ మోదీ పరువునష్టం దావా వేశారు. దీంతో విచారణ చేపట్టిన సూరత్ కోర్టు.. నాలుగేళ్ల విచారణ తర్వాత రాహుల్‌ని దోషిగా తేల్చడమే కాక 2 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అంతేకాక రూ.15 వేల జరిమానా కూడా విధించింది. మరోవైపు IPC సెక్షన్ 499, 500 కింద రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేశారు సూరత్ కోర్టు ఛీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ.

కాగా సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో అప్పీల్‌కి వెళ్లేందుకు రాహుల్‌గాంధీ నిర్ణయించుకున్నారు. అయితే ఈలోపే ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎందుకంటే ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్‌ నుంచి ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీ నిన్నటి నుంచే అనర్హత వేటు అమలులోకి వచ్చింది.

రాహుల్‌ భవిష్యత్‌ ఏంటి..!

తాజాగా రాహుల్ గాంధీపై లోక్‌సభ వేసిన అనర్హత వేటుతో ఆయన ఎన్నికల్లో పోటీకి 8 ఏళ్లు దూరం కానున్నారు. శిక్ష పడిన 2 ఏళ్లతోపాటు మరో 6 ఏళ్లు పోటీకి అవకాశం ఉండదు. సూరత్ కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న రాహుల్.. పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. తీర్పు అమలును నిలిపివేయాలని కోరే ఛాన్స్‌ ఉన్న నేపథ్యంలో.. కోర్టు అనుమతిస్తే వేటు నుంచి తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. మరోవైపు ఈ అనర్హతపై సుప్రీం వరకూ వెళ్లే అవకాశం రాహుల్ గాంధీకి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..