Rahul Gandhi Bharat Jodo Yatra: ‘పేసీఎం’ టీషర్ట్‌తో కాంగ్రెస్‌ కార్యకర్త.. టీషర్ట్‌ను విప్పించి యువకుడిని చితకబాదిన పోలీసులు..

2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకలో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. చామరాజునగర్‌ జిల్లాల్లో జరుగుతున్న..

Rahul Gandhi Bharat Jodo Yatra: ‘పేసీఎం’ టీషర్ట్‌తో కాంగ్రెస్‌ కార్యకర్త.. టీషర్ట్‌ను విప్పించి యువకుడిని చితకబాదిన పోలీసులు..
Karnataka Congress

Updated on: Oct 01, 2022 | 9:05 PM

2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకలో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. చామరాజునగర్‌ జిల్లాల్లో జరుగుతున్న పాదయాత్రకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పోటెత్తారు. వేలాదిమంది కార్యకర్తలు రాహుల్‌కు తోడుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్‌ నేతలు ర్యాలీలో పాల్గొంటున్నారు. అయితే చామరాజునగర్‌లో పాదయాత్ర సందర్భంగా కొందరు కార్యకర్తలు పేసీఎం టీషర్ట్‌ వేసుకున్నారు. ఆ టీషర్ట్స్‌ని చూసిన పోలీసులు రెచ్చిపోయారు. పేసీఎం టీషర్ట్స్ ధరించిన కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని చితకబాదారు. ఆ టీషర్ట్స్‌ని విప్పించి, అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల పట్ల పోలీసుల తీరు వివాదంగా మారింది.

పోలీసుల చర్యపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కర్నాటక పోలీసులు తాము రాచరికంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని అన్నారు కాంగ్రెస్‌ నేత ప్రియాంక్‌ ఖర్గే. పోలీసులకు ప్రజల నుంచే జీతాలు వస్తున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సీఎంకు ప్రతి పనిలో కమీషన్లు ముడుతున్న విషయం అందరికి తెలుసన్నారు. ‘వాళ్ల రేటును చెబితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. పోలీసులు ప్రభుత్వ ఉద్యోగుల్లా పనిచేయడం లేదు. వాళ్లకు జీతాలు ఎవరు చెల్లిస్తున్నారు. రాజు సేవలో ఉన్నామన్న భ్రమలో పోలీసులు ఉన్నారు’ అంటూ ఫైర్ అయ్యారు. ఇక పోలీసుల తీరుపై మాజీ సీఎం సిద్దరామయ్య కూడా మండిపడ్డారు. కాంగ్రెస్‌ కార్యకర్తపై దాడి చేసిన పోలీసులు బీజేపీ కార్యకర్తల్లా వ్యవహరించారని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..