Ajay Kumar Mishra: మరో వివాదంలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా.. పిచ్చి పిచ్చిగా ఉందా.. అంటూ మీడియాకు బెదిరింపులు

Lakhimpur Kheri Case: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటనపై తాజాగా ఉభయసభలు అట్టుడుకుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనకు బాధ్యతగా

Ajay Kumar Mishra: మరో వివాదంలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా.. పిచ్చి పిచ్చిగా ఉందా.. అంటూ మీడియాకు బెదిరింపులు
Ajay Kumar Mishra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 15, 2021 | 6:44 PM

Lakhimpur Kheri Case: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటనపై తాజాగా ఉభయసభలు అట్టుడుకుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనకు బాధ్యతగా కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. లఖీంపూర్ ఖేరి కేసులో తన కుమారుడు అడ్డంగా బుక్కయినప్పటికీ కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తీరు మారడంలేదు. తాజాగా ఆయన మీడియాపై చిందులు వేశారు. ఈ కేసులో కేంద్రమంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రా ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ క్రమంలో బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న అజయ్‌ మిశ్రా మిడియాను దూషించారు. రైతులపై కావాలనే తన కాన్వాయ్‌ను దూసుకెళ్లించినట్టు సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నివేదికలో వెల్లడించింది. ప్రణాళికాబద్దమైన కుట్రతోనకే ఈ ఘటన జరిగినట్లు దర్యాప్తు బ‌ృందం తెలపడంతో.. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా అసహనానికి గురయ్యారు. ఈ విషయంపై బుధవారం ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులను కేంద్రమంత్రి అజయ్ మిశ్రా బండబూతులు తిట్టారు. పిచ్చి పిచ్చిగా ఉందా ? అంటూ ఓ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా. అంతేకాదు ఇక్కడి నుంచి కెమెరాలు బంద్‌ చేసుకొని వెళ్లిపోవాలని ఇతర మీడియా సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటన తాజాగా సంచలనంగా మారింది.

పిచ్చి పిచ్చిగా ఉందా ? అని ఓ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా. అంతేకాదు ఇక్కడి నుంచి కెమెరాలు బంద్‌ చేసుకొని వెళ్లిపోవాలని ఇతర మీడియా సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మైండ్‌ ఖరాబయ్యిందా ? .. సిగ్గు లేదా.. అంటూ జర్నలిస్టులను దూషించారు అజయ్‌ మిశ్రా. ఓ దశలో విలేక‌రుల‌పై దూసుకెళ్లేంత ప‌ని చేశారు. ‘మీరంతా దొంగ‌లే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న ముంద‌స్తు ప్రణాళికతో జ‌రిగిన కుట్రే అని ఆ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సిట్ తేల్చి చెప్పడంతో రాజ‌కీయంగా పెను దుమారం రేగుతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రాపై విప‌రీత‌మైన ఒత్తిడి పెరుగుతోంది. ఆయ‌న్ను కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని కాంగ్రెస్ స‌హా విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఈ విష‌యంపై లోక్‌స‌భలో వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు.

వీడియో..

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా లఖీంపూర్ ఖేరి పర్యటనలో అక్టోబర్ 3న.. నిరసన చేస్తున్న రైతులపైకి ఆయన కొడుకు ఆశిశ్‌ మిశ్రా కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర మంత్రి కొడుకు ఆశిశ్‌ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. రైతులు, విపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడితో కేంద్రం.. ఈ ఘటనపై సిట్‌ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ హింసాకాండ ప్రణాళికాబద్దమైన కుట్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వెల్లడించింది. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు అశిశ్ మిశ్రాపై ఇప్పటికే న‌మోదైన‌ అభియోగాల‌ను మార్చాల‌ంటూ ఈ కేసు విచార‌ణ జ‌రుపుతున్న న్యాయ‌మూర్తికి సిట్ లేఖ రాసింది. ఇప్పటికే ఈ కేసులో మంత్రి కుమారుడు ఆశిశ్‌ మిశ్రా, తదితరులపై హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలతోపాటు హత్యయత్నం, ఇతర అభియోగాలను కూడా ఈ కేసులో చేర్చాలని సిట్‌ ఆ లేఖలో కోరింది.

Also Read:

Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు మరింత ఊరట.. ఆ అవసరం లేదన్న బాంబే హైకోర్టు..

SBI Interest Rate: వినియోగదార్లకు ఎస్బీఐ షాక్.. వడ్డీ రేటును పెంచిన బ్యాంక్.. ఎంత పెరిగిందంటే..