AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గోమూత్రంతో కర్ణాటక విధానసౌధను శుద్ధి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. వీడియో..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీపై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. వెంటనే హామీల అమలుపై దృష్టిసారించింది.

Watch Video: గోమూత్రంతో కర్ణాటక విధానసౌధను శుద్ధి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. వీడియో..
Karnataka Assembly
Shaik Madar Saheb
|

Updated on: May 22, 2023 | 12:20 PM

Share

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీపై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. వెంటనే హామీల అమలుపై దృష్టిసారించింది. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం.. జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో ఐదు కీలక హామీలపై సిద్ధరామయ్య సంతకం చేశారు. కర్ణాటక గెలుపుతో ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్.. సార్వత్రిక ఎన్నికలపై దృష్టిసారించింది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్.. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక చేపట్టింది. 2024 ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాలంటూ డీకే శివకుమార్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం వినూత్న పద్దతిలో పూజలు చేశారు.

సోమవారం కర్ణాటక అసెంబ్లీ సమావేశాల తొలిరోజు కార్యక్రమాలకు ముందు బెంగళూరులోని విధానసౌధలో కాంగ్రెస్ కార్యకర్తలు గోమూత్రం చల్లి పూజలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీని ‘శుద్ధి’ చేస్తున్నామంటూ ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ కార్యకర్తల గోమూత్ర పూజలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

అసెంబ్లీ సమావేశాలకు ముందు కాంగ్రెస్ కార్యకర్తల గోమూత్ర శుద్ధి పూజలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..