Night Curfew: నైట్‌ కర్ఫ్యూ.. బార్లు, థియేటర్లు, జిమ్‌, కోచింగ్ సెంటర్లు మూసివేత.. ఈనెలాఖరు వరకు కఠిన ఆంక్షలు

Night Curfew: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అమాంతంగా పెరిగిపోతున్నాయి. సెకండ్‌వేవ్‌ కరోనాతో పలు రాష్ట్రాలు కఠిన చ

Night Curfew: నైట్‌ కర్ఫ్యూ.. బార్లు, థియేటర్లు, జిమ్‌, కోచింగ్ సెంటర్లు మూసివేత.. ఈనెలాఖరు వరకు కఠిన ఆంక్షలు
Night Curfew
Follow us

|

Updated on: Apr 19, 2021 | 8:49 PM

Night Curfew: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అమాంతంగా పెరిగిపోతున్నాయి. సెకండ్‌వేవ్‌ కరోనాతో పలు రాష్ట్రాలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రం కొత్త ఆంక్షలు , మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. పంజాబ్‌ ప్రభుత్వం తీసుకున్న కొత్త ఆంక్షలు, మార్గదర్శకాలు సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు అమల్లో ఉండనున్నాయి. కరోనాపై సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. అలాగే అలాగే ఈనెల 30 వరకు బార్లు, సినిమా హాళ్లు, జిమ్స్‌, స్పాలు, కోచింగ్‌ సెంటర్లను మూసివేయనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రం సోమవారం నుంచి శనివారం వరకు టెక్‌ అవేకు మాత్రమే అనుమతిస్తారు. వివాహాలు, అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువగా అనుమతించరు. పది మంది కంటే ఎక్కువ మంది పాల్గొనేందుకు జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్‌ సింగ్‌ తెలిపారు. ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుకు రూ.450, ఆర్టీఏ టెస్టుకు రూ.300 మాత్రమే వసూలు చేయాలని ప్రైవేటు ల్యాబ్‌లను ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటించనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని, అలాగే మాస్కలు తప్పనిసరిగా ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు.

కాగా, పంజాబ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. అయినా కేసుల మాత్రం ఏ మాత్రం ఆగడం లేదు. భారీగా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మాస్క్‌లు ధరించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి: Coronavirus: ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు… రికార్డ్‌ స్థాయిల్లో కేసులు నమోదు

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు