Pregnant with Twins: మనిషి రూపంలో రాక్షసుడు.. నిండు గర్భిణిని మంచానికి కట్టేసి నిప్పంటించిన భర్త!

|

Apr 21, 2024 | 10:43 AM

ఆ తల్లి ఇద్దరు బిడ్డలను కడుపున మోస్తోంది. బిడ్డలు భూమిపైకి వచ్చే గడియల కోసం వేయి కళ్లతో కలలు కంటోంది. కానీ భర్త రూపంలో మృత్యువు తన పక్కనే ఉందనే విషయం గ్రహించలేకపోయింది. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా.. కనీన కనికరం లేకుండా కట్టుకున్న భార్యను కడుపులో బిడ్డలతో సహా అత్యంత పాసవికంగా హత్య చేశాడు ఆ పతి దేవుడు. మంచంపై నిద్రపోతున్న భార్య చేతులు కాళ్లు కట్టేసి నిప్పంటించి..

Pregnant with Twins: మనిషి రూపంలో రాక్షసుడు.. నిండు గర్భిణిని మంచానికి కట్టేసి నిప్పంటించిన భర్త!
pregnant with twins tied to bed and set fire
Follow us on

అమృత్‌సర్, ఏప్రిల్ 21: ఆ తల్లి ఇద్దరు బిడ్డలను కడుపున మోస్తోంది. బిడ్డలు భూమిపైకి వచ్చే గడియల కోసం వేయి కళ్లతో కలలు కంటోంది. కానీ భర్త రూపంలో మృత్యువు తన పక్కనే ఉందనే విషయం గ్రహించలేకపోయింది. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా.. కనీన కనికరం లేకుండా కట్టుకున్న భార్యను కడుపులో బిడ్డలతో సహా అత్యంత పాసవికంగా హత్య చేశాడు ఆ పతి దేవుడు. మంచంపై నిద్రపోతున్న భార్య చేతులు కాళ్లు కట్టేసి నిప్పంటించి కడుపులో ప్రాణం పోసుకుంటున్న పసికూనలతో సహా భార్యను హతమార్చాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 19) చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా రయ్య ప్రాంతంలోని బులేద్ నంగల్ గ్రామంలో కాపురం ఉంటోన్న సుఖ్‌దేవ్, పింకీ భార్యభర్తలు. పింకీ ఆరు నెలల గర్భిణీ. ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమె గర్భంలో కవలలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో శుక్రవారం మరోవారు గొడవపడ్డారు. అదికాస్తా తీవ్రస్థాయికి చేరుకుంది. కోపోద్రిక్తుడైన సుఖ్‌దేవ్‌ క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు. భార్యపై కోపంతో ఆమెను మంచానికి కట్టివేసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన పింకీ కడుపులో బిడ్డలతో సహా సజీవ దహనమైంది. ఇరుగు పొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

భార్య, పుట్టబోయే పిల్లలను ఇంత హింసాత్మకంగా హత్య చేయడానికి దారితీసిన కారణమేమిటో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించనపి, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇన్‌స్పెక్టర్ గుర్విందర్ సింగ్ తెలిపారు. కాగా నిందితుడు సుఖ్‌దేవ్ పరారీలో ఉన్నాడు. నిందిడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.