KCR – Bhagawant Mann: ఇవాళ హైదరాబాద్‌కు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేసీఆర్‌తో కీలక భేటీ..
సీఎం కేసీఆర్‌తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భేటీ కానున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న భగవంత్ సింగ్ మాన్..
సీఎం కేసీఆర్‌తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భేటీ కానున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న భగవంత్ సింగ్ మాన్‌ను.. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు భగవంత్ మాన్ మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. ప్రగతిభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఇద్దరు నేతలు భేటీ అవుతుండటంతో ఈ సమావేశానికి సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశ రాజకీయాల్లో అడుగుపెట్టిన గులాబీ అధినేత కేసీఆర్.. అన్ని రాష్ట్రాలతో సత్సంబంధాలు ఏర్పర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 24న పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ హైదరాబాద్ రానున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..